icon icon icon
icon icon icon

డబ్బులిచ్చి.. వాలంటీర్లతో రాజీనామా చేయించి

తాము ఏమి చెప్పినా వాలంటీర్లు వింటారనుకుంటున్న వైకాపా నాయకులకు వారు ఝలక్‌ ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంలో 14 గ్రామ సచివాలయాల పరిధిలో 142 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.

Published : 07 May 2024 04:55 IST

కనిగిరి నియోజకవర్గంలో వైకాపా నాయకుల బరితెగింపు

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: తాము ఏమి చెప్పినా వాలంటీర్లు వింటారనుకుంటున్న వైకాపా నాయకులకు వారు ఝలక్‌ ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంలో 14 గ్రామ సచివాలయాల పరిధిలో 142 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వారిని రాజీనామా చేయమని అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం వైకాపా నాయకులు రూ.5 వేల వంతున వాలంటీర్లకు డబ్బులిచ్చి బలవంతంగా 22 మందిచేత రాజీనామాలు చేయించారు. మరోవైపు గతంలో రాజీనామా చేసిన 22 మందికి అప్పట్లో ఏమీ ఇవ్వకపోవడంతో తాజాగా విషయం రచ్చకెక్కింది. మొత్తంగా ఇప్పటివరకు 44 మంది మాత్రమే రాజీనామాలు ఇచ్చారు. మిగిలిన వారు ససేమిరా అంటుండటంతో బేరసారాలకు దిగుతున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని.. మాట వినకపోతే ఈ సారి కొత్తవారిని నియమించుకుంటామని బెదిరిస్తున్నట్లు కొందరు వాలంటీర్లు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img