icon icon icon
icon icon icon

మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే అది జగనే

వేమగిరి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే అచ్చం జగన్‌లాగే ఉంటుందని తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో మొదటి బాధితులు యువతేనన్నారు. రాష్ట్రానికి కొత్తగా ఒక్క కంపెనీ తీసుకురాకపోగా, ఉన్నవాటినీ తరిమేశారని మండిపడ్డారు.

Published : 07 May 2024 05:04 IST

వేమగిరి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే అచ్చం జగన్‌లాగే ఉంటుందని తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో మొదటి బాధితులు యువతేనన్నారు. రాష్ట్రానికి కొత్తగా ఒక్క కంపెనీ తీసుకురాకపోగా, ఉన్నవాటినీ తరిమేశారని మండిపడ్డారు. ‘2019లో ఒక్క ఛాన్స్‌ నినాదంతో ప్రజలు మోసపోయారు. ప్రపంచం మొత్తం మోదీ, భారతదేశం వైపు చూస్తుంటే సీఎం జగన్‌ మూడు రాజధానులంటూ దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నారు. విశాఖకు మోదీ రైల్వేజోన్‌ కేటాయిస్తే దానికి భూమి కూడా రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేదు. మంగళగిరి ఎయిమ్స్‌కు నీటివసతి కల్పించలేదు’ అని విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరంలోని వేమగిరి వద్ద ఎన్నికల సభలో లోకేశ్‌ మాట్లాడారు. ‘పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది పవనన్నే. ప్రశ్నించే గొంతు ఆయన. ప్రజల తరఫున పోరాడుతున్నారు’ అని పేర్కొన్నారు.

సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళతాం

‘సంక్షేమం, అభివృద్ధి అనే జోడెద్దుల బండిని ముందుకు తీసుకెళతామని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సమస్యలను ప్రధాని మోదీ ముందు ఉంచారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 226 రోజులపాటు 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. రాష్ట్ర యువత సమస్యల్ని మీ ముందు ఉంచుతున్నాను. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. రానున్న ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రానికి గుండెకాయ లాంటి పోలవరాన్ని పూర్తిచేయాలి. రాష్ట్రాలుగా పోటీపడి, దేశాన్ని బలోపేతం చేయాలన్న మీ మాటలు మాకు స్ఫూర్తి. ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా తయారుచేయాలనే మీ సంకల్పంలో మేం భాగస్వాములవుతాం. ‘ప్రధాని మోదీ విశ్వజిత్‌.. అంటే విశ్వాన్ని జయించిన వ్యక్తి. ఆయన వల్లే ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోంది. తెలుగుజాతి పౌరుషాన్ని ఎన్టీఆర్‌ చూపిస్తే భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మోదీ. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరో పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నారు. వికసిత్‌ భారత్‌ మోదీ కల... వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ లక్ష్యం’ అని పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు తదితర సమస్యలను ప్రధాని ముందు ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img