icon icon icon
icon icon icon

విశ్వరూప్‌కు ఓటు వేయం!.. మంత్రి ఆఫీసు నుంచి వచ్చిన ఫోన్‌కు యువకుడి స్పందన

‘మంత్రి విశ్వరూప్‌కు ఓటు వేయం.. ఎందుకంటే.. కోనసీమ అల్లర్ల సమయంలో వాళ్ల ఇంటిని ఎవరు తగలబెట్టారో తెలియదు.

Updated : 10 May 2024 07:35 IST

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ‘మంత్రి విశ్వరూప్‌కు ఓటు వేయం.. ఎందుకంటే.. కోనసీమ అల్లర్ల సమయంలో వాళ్ల ఇంటిని ఎవరు తగలబెట్టారో తెలియదు. అటువైపుగా కళాశాలకు వెళ్లి వస్తుంటే నన్ను పోలీసులు లోపలేసి, 84 రోజులు జైల్లో ఉంచారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ యువకుడి ఫోన్‌ సంభాషణ గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మంత్రి పినిపే విశ్వరూప్‌ కార్యాలయం నుంచి ఓటర్లకు ఫోన్లు చేసి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఆ క్రమంలో ఓ యువకుడికి చేసిన ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అందులో విశ్వరూప్‌కు తాను ఓటెయ్యనని, మరో 30 మంది ఓటెయ్యకుండా చెడగొడతా అంటూ.. బాధిత యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమలాపురంలో విశ్వరూప్‌ నెగ్గటానికి వీల్లేదని, ఆయనకు ఓట్లు వేయమని ఇదే విషయాన్ని మంత్రికి చెప్పుకోండంటూ సమాధానమివ్వడంతో ఫోన్‌ చేసిన మహిళ కంగుతిన్నారు.

వైకాపా సృష్టించిన సమస్యను మర్చిపోలేం.. : అమలాపురం అల్లర్ల ఘటనలకు సంబంధించి వైకాపా సృష్టించిన సమస్యను ప్రజలు మర్చిపోలేరంటూ సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఓ పోస్టింగ్‌ గురువారం డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. ఈ పోస్టింగ్‌లో అల్లర్ల వివాదాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను నిక్షిప్తం చేశారు. దానికి ‘హలో కోనసీమ.. బై బై వైసీపీ’  ‘వుయ్‌ విల్‌ నెవర్‌ ఫర్‌గెట్‌.. నెవర్‌ ఫర్‌గివ్‌’ అనే నినాదాలను ట్యాగ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img