icon icon icon
icon icon icon

కాకినాడలో పవన్‌ సభ అడ్డగింతకు వైకాపా కుయుక్తులు

కాకినాడ నగరంలో ఈ నెల 11న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రోడ్డుషో, సభ జరగనీయకుండా వైకాపా కుయుక్తులు పన్నింది.

Updated : 10 May 2024 10:00 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ నగరంలో ఈ నెల 11న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రోడ్డుషో, సభ జరగనీయకుండా వైకాపా కుయుక్తులు పన్నింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాకినాడలోని వివిధ ప్రాంతాల్లో పవన్‌కల్యాణ్‌ పర్యటిస్తారని తెలుసుకున్న వైకాపా అడ్డుకోవడానికి కుట్ర పన్నింది. అదే రోజున నగరంలోని ఎనిమిది కీలక ప్రాంతాల్లో ప్రాంతాల్లో రోడ్‌షో, సభలు నిర్వహించేందుకు పోలీసుశాఖ, రిటర్నింగ్‌ అధికారి నుంచి వైకాపా నాయకులు అనుమతులు పొందారు. ఈ నెల 11న పవన్‌ రోడ్డుషో, సభకు అనుమతి ఇవ్వాలని గురువారం తెదేపా నాయకులు పోలీసులకు దరఖాస్తు చేశారు. దీనికి కాకినాడ డీఎస్పీ అనుమతి నిరాకరించారు. దీనిపై తెదేపా నాయకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై కాకినాడ నగర నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి జె.వెంకట్రావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. వైకాపా అనుమతులు తీసుకుందని, పవన్‌కల్యాణ్‌ సభకు అనుమతి ఇస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని డీఎస్పీ చెబుతున్నారని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img