icon icon icon
icon icon icon

Pawan Kalyan: ఆత్మగౌరవం ఉన్నవారంతా వైకాపాను వీడారు: పవన్‌ కల్యాణ్‌

 ‘క్లాస్‌ వార్‌’ అంటూ ఊదరగొట్టే సీఎం జగన్‌.. చదువుకున్న యువకులకు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

Published : 08 May 2024 16:56 IST

హనుమాన్‌ జంక్షన్‌: ‘క్లాస్‌ వార్‌’ అంటూ ఊదరగొట్టే సీఎం జగన్‌.. చదువుకున్న యువకులకు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్‌ జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సంక్షేమంతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందేలా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆత్మగౌరవం ఉన్నవారంతా వైకాపా నుంచి బయటకు వస్తున్నారని.. అందుకు యార్లగడ్డ వెంకటరావు, వల్లభనేని బాలశౌరిలే నిదర్శనమని చెప్పారు. 

వైకాపా అభ్యర్థి వంశీకి ఓటు వేస్తే.. మహిళలను కించపరిచేవారికి మద్దతిచ్చినట్లేనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.  బ్రహ్మలింగం చెరువు మట్టిని స్థానిక ఎమ్మెల్యే వంశీ తోడేస్తున్నారని ఆరోపించారు. వెండి సింహాలు పోతే.. వాటితో మేడలు, మిద్దెలు కట్టుకుంటారా? అని వైకాపా నేతలు ఎగతాళి చేశారని మండిపడ్డారు. ప్రజాహితం కోరుకునే జనసేన మద్దతుదారులు వంశీ మాయలో పడొద్దని, ఆయన ఇచ్చే డబ్బుకు లొంగొద్దని కోరారు. మల్లవల్లి పారిశ్రామికవాడకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయం బాధితులకు కూడా నష్టపరిహారం అందేలా చేస్తామన్నారు.  ప్రజలను భయపెట్టే వారు కావాలో.. యార్లగడ్డ లాంటి  సంస్కారవంతుడు కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img