Creative soaps : వావ్.. నోరూరించే సబ్బులు!
రష్యాకు చెందిన ఓ యువతి విభిన్న ఆకృతుల్లో సబ్బులు తయారు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ఆమె సృజనాత్మకతకు అంతా ఫిదా అవుతున్నారు.
(Image : Omnom soap insta)
మనం స్నానం చేయడానికి ఉపయోగించే సబ్బులన్నీ(Soaps) రంగు, వాసనలో భిన్నంగా ఉన్నప్పటికీ ఆకారంలో ఇంచుమించు ఒకేలా కన్పిస్తాయి. రష్యా(Russia)కు చెందిన యువతి జులియా పొపొవా తయారు చేసే సబ్బులు(Soaps) మాత్రం పిజ్జా, బర్గర్, టెడ్డీబేర్, పండ్లు, మద్యం సీసాలు, చేపలు(Fish), నాణేలు ఇలా విభిన్న ఆకారాల్లో దర్శనమిస్తాయి. ఆమె రూపొందించిన వాటిలో.. నోరూరించే ఆహారంలా కన్పించే సబ్బులను తినడానికి యత్నించి నోరెళ్లబెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆ విశేషాలేంటో చదివేయండి.
గుర్రం బొమ్మతో మొదలై..
రష్యా(Russia)లోని సెయింట్ పీటర్స్‌బర్గ్స్‌కు చెందిన జులియా పొపొవాకు యూనివర్సిటీలో చదివే రోజుల్లో సబ్బులను విభిన్న ఆకారాల్లోకి మార్చాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా మార్కెట్లో లభించే సబ్బులు కొని, వాటిని కరిగించి ఏ రూపంలోకి మారిస్తే బాగుంటుందని వెతికింది. తన అపార్ట్‌మెంట్‌లో ఓ గుర్రం బొమ్మ కనపడటంతో దాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తూ సబ్బు తయారు చేసింది. అచ్చు బాగా కుదిరేందుకు సిలికాన్‌ను ఉపయోగించింది. ఆ గుర్రం బొమ్మ చాలా బాగా రావడంతో జులియాను బంధువులు, స్నేహితులు అభినందించారు. దాంతో ఆమెకు మరింత ఆసక్తి పెరిగింది. అనేక రకాల ఆకారాల్లో సబ్బులు తయారు చేయడం మొదలుపెట్టింది.
ఉద్యోగం వీడి మార్కెట్లోకి..
స్నేహితుల పుట్టిన రోజులు, బంధువుల కార్యక్రమాల్లో బహుమతిగా సరికొత్త సబ్బులను ఇవ్వడం జులియాకు అలవాటైపోయింది . వారి నుంచి అభినందనలు వెల్లువెత్తుతుండటంతో తాను కొత్తగా తయారు చేసిన వాటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో తాను చేస్తున్న ఉద్యోగం జులియాకు నచ్చలేదు. వెంటనే రాజీనామా చేసి విభిన్న ఆకారాల్లో సబ్బులు తయారు చేయడంలో బిజీ అయిపోయింది. వాటిని స్థానిక మార్కెట్లో విక్రయించడంతో మంచి ఆదాయం వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె సొంత కంపెనీ స్థాపన దిశగా అడుగులు వేసింది.
(Image : Omnom soap insta)
సొంత ఇమేజ్‌తో ఓ బ్రాండ్
జులియా అప్పటి వరకు ఇతర కంపెనీల సబ్బులు కరిగించి వివిధ ఆకృతులు తయారు చేసింది. సొంతంగా ‘ఓమ్‌నామ్’ అనే బ్రాండ్‌ను స్థాపించి తనదైన శైలిలో సబ్బులు తయారు చేయడం మొదలుపెట్టింది. ఆమె నైపుణ్యంతో సబ్బులు రకరకాల ఆకారాల్లోకి మారిపోయాయి. సాధారణంగా సబ్బులు పూలు, గంధం తదితర సువాసనలతో ఉంటాయి. ఈమె కొంచెం విభిన్నంగా ఉండాలని వెనీలా, స్ట్రాబెరీ లాంటి ఫ్లేవర్లు మేళవించింది. ఆమె రూపొందించిన చేప ఆకారంలోని సబ్బుకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సబ్బు నిమ్మ వాసన వచ్చేది. ముచ్చటగా కన్పిస్తున్న వాటిని అనేక మంది స్నానానికి ఉపయోగించకుండా ఒక అలంకరణ వస్తువులా ఇళ్లల్లో పెట్టుకునేవారు.
వ్యాపారాన్ని విస్తరించేందుకు జులియా రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు తెరిచింది. తన పోస్టులు చూసి వచ్చే ఆర్డర్లను బట్టి.. డెలివరీలు చేసింది. బిజినెస్ విస్తృతమవడంతో ‘ఇట్సీ స్టోర్’ అనే ఈ కామర్స్ సంస్థలో ఉత్పత్తులను విక్రయానికి పెట్టింది. దాంతో దేశ విదేశాల నుంచి కూడా ఆమెకు ఆర్డర్లు వస్తున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది