Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 11 Mar 2024 08:59 IST

1. అక్రమాల్లో సాగి.. అవినీతిలో ఊగి!

ట్రాన్స్‌ఫార్మర్‌ వేయాలంటే కమీషన్‌.. రోడ్డు మరమ్మతు చేయాలంటే కమీషన్‌.. ప్రజలకు అవసరమైన పనుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలంటే కమీషన్‌.. పని ఏదైనా సరే ‘నాకేంటి’ అని చేయి చాచడమే అయిన ‘పని’. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను తరచూ మార్చే ఈ ప్రజాప్రతినిధికి ఎక్కడికి వెళితే అక్కడ జోలె పట్టడం ఆనవాయితీ. పూర్తి కథనం

2. కెప్టెన్‌గా రో‘హిట్‌’

కీలక ఆటగాళ్లు లేరు.. అయినా అతను బెదరలేదు. తొలి టెస్టులోనే ఓటమి ఎదురైంది.. అయినా అతను ఢీలా పడలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు మద్దతుగా నిలిచి.. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుని.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో జట్టును విజయతీరాల వైపు నడిపించాడు. నాయకుడంటే.. సవాళ్లకు ముందు నిలిచేవాడు. సారథి అంటే.. ప్రతికూల పరిస్థితుల్లోనూ జట్టును గెలుపు వైపు మళ్లించేవాడు. తాజాగా ఇంగ్లిష్‌ జట్టుతో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ శర్మ అదే చేశాడు. పూర్తి కథనం

3. ఉల్లి.. ఏడిపిస్తోంది..!

ఏటా ఉల్లి ధరలు ఆకాశాన్నంటి ప్రజలను కన్నీళ్లు పెట్టించడం చూస్తూనే ఉంటాం. ఈసారి మాత్రం పంట సాగు చేసిన రైతులకు ఆశించిన ధర దక్కకపోవడంతో దిగులు చెందుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర పర్వాలేదనిపిస్తున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి సరకు దిగుమతి అవుతుండడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి కథనం

4. రోడ్డునూ రాసిచ్చేశారు!

పదిహేనేళ్ల కిందట బ్రాహ్మణచెర్వులో పేదలకు స్థలాలు కేటాయించారు. అక్కడ రూ.50 వేలు విలువ చేయని స్థలం... కాలనీ ఏర్పడ్డాక రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఆ కాలనీలో ‘ఖాళీ స్థలాలపై’ అధికార పార్టీ నేతల కన్నుపడింది. ప్రజావసరాలకు కేటాయించిన ఖాళీ స్థలాలను ప్లాట్లుగా విభజించి కొందరికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.పూర్తి కథనం

5. ఆహారశుద్ధి.. మాటల్లోనే లబ్ధి..!

రైతులు అధికంగా పండిస్తున్న పంటల మేరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆహారశుద్ధి రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలు అనుసరిద్దాం. ఇందుకోసం రూ.2,900 కోట్లు వెచ్చించనున్నాం. రైతులకు మంచి ధరలు అందించడమే మనం లక్ష్యం. నిర్ణీత ధరలకు కొనుగోలు చేస్తామని ముందుగానే చెబుతాం.పూర్తి కథనం

6. భయం వద్దు.. ఆకాశమే హద్దు!

ఏటా పరీక్షలు బాగా రాయలేకపోయామని ఇంటర్‌, పది విద్యార్థులు చేసుకుంటున్న ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చరణ్‌తేజ్‌ వార్షిక పరీక్షల ఒత్తిడి కారణంగానే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్‌లో వారికి ఇష్టమున్న గ్రూప్‌లో చేరనివ్వకుండా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన కోర్సుల్లో చేర్పిస్తారు.పూర్తి కథనం

7.ప్రయాణికులేమైపోనీ.. ఆర్టీసీకేల..!

ప్రయాణికుల సేవలో తరలించాల్సిన ఆర్టీసీ అధికారులు వైకాపా అడుగులకు మడుగులు వొత్తుతున్నారు. సుమారు 460 కి.మీ. దూరంలో ఉన్న మేదరమెట్లలో ఆదివారం జరిగిన సిద్ధం సభకు నగరం నుంచి 100 వరకు బస్సులను తరలించేశారు. దీంతో ఆదివారం నగరంలో సిటీ బస్సుల కొరత ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పూర్తి కథనం

8. కబేళా కథ.. మళ్లీ మొదటికి

జియాగూడలోని కబేళా అభివృద్ధి ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చింది. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయింది. పీపీపీ పద్ధతిలో స్థానిక వ్యాపారుల భాగస్వామ్యంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అనేక ప్రయత్నాలు చేసింది. పూర్తి కథనం

9. దేనికైనా ఓ లెక్క ఉండాలబ్బా!

ఏ పని చేసినా ఒక పద్ధతి ఉండాలంటారు. దీనినే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు ఓ లెక్కతో నడవాలని చెబుతారు. ఆలోచించి అడుగేయకుంటే అనర్థాలు తప్పవని స్థూలంగా ఈ మాటల మర్మం. కొందరు కొన్ని విషయాల్లో ‘అతి’ చేస్తుంటారు. దీని మూలంగా వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. వాహన వేగంలో పరిమితి లేకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.పూర్తి కథనం

10. రేషన్‌ బియ్యంతో రక్తహీనతను అధిగమించొచ్చు: ఎన్‌ఐఎన్‌

రేషన్‌ బియాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నారా...? అయితే డబ్బు ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్టే. కిలోకి రూ.10 కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే.. తర్వాత ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు