Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Aug 2022 13:04 IST

1. 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్‌రామ్‌నూ ఇలాగే కొట్టారు..

 తాగునీటి కుండను తాకినందుకు టీచర్‌ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృతిచెందిన ఘటన రాజస్థాన్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దారుణ ఉదంతంపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల క్రితం తన తండ్రి, దివంగత నేత బాబు జగ్జీవన్‌ రామ్‌కూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని.. అయితే అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డారని ట్విటర్‌లో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మోదీజీ.. చిత్తశుద్ధి ఉంటే ఆ విషయంలో జోక్యం చేసుకోండి: కేటీఆర్‌

గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిషన్‌ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు గుజరాత్‌ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని మోదీని ట్యాగ్‌ చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీమ్‌ఇండియా స్టార్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే ఉత్తమం: రికీ పాంటింగ్‌

మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో విభిన్న కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. ప్రతి ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేలా తయారు చేస్తోంది. రెగ్యులర్‌గా విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌లో ఎవరో ఒకరితో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేవాడు. అయితే ఇటీవల వెస్టిండీస్‌తో వారిద్దరూ గైర్హాజరు కావడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ (ఎస్‌కేవై)తో రోహిత్ ఓపెనింగ్ చేయించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సూర్యకుమార్‌ను పాంటింగ్‌ అలా పోల్చడం తొందరపాటే అవుతుంది!​

4. కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?

కరోనా మహమ్మారి వ్యాప్తి వేళ.. గతంలో అమెరికా వెళ్లిన కేంద్రమంత్రి ఎస్‌ జైశంకర్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. టీకా ధ్రువపత్రం గురించి ఆయన చెప్పిన విషయం నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే... గత రెండున్నరేళ్లుగా ఈ ప్రపంచం కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతూనే ఉంది. వ్యాప్తి కట్టడి కోసం కఠిన ఆంక్షల అమలు ఒకవైపు.. టీకా పంపిణీ మరోవైపు సాగుతోంది. ఈ మధ్యలో 2021లో ఆంక్షలు సడలించిన సమయంలో జై శంకర్ అమెరికా వెళ్లారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మస్క్‌ మళ్లీ జోక్‌ చేశాడు..!

ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ‘మాంచెస్టర్‌ యునైటెడ్‌’ను కొనుగోలు చేస్తానంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ తాజాగా ట్విటర్‌లో మరోసారి గందరగోళం సృష్టించారు. ఈ డీల్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ట్వీట్లతో సంచలనాలు సృష్టించిన చరిత్ర మస్క్‌కు ఉండటంతో.. వెంటనే దీనిని నమ్మలేని పరిస్థితి విశ్లేషకుల్లో నెలకొంది. ఈ ట్వీట్‌ అనంతరం ‘మాంచెస్టర్‌ యునైటెడ్‌’ యాజమాని అయిన గ్లాజెర్స్‌ ఫ్యామిలీని, మస్క్‌ను వార్తా సంస్థలు సంప్రదించగా ఎలాంటి స్పందనా రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏలూరు జిల్లాలో విషాదం.. పిడుగుపాటుతో నలుగురి మృతి

 ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం రాత్రి పిడుగుపడి నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జామాయిల్‌ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం. మృతులను కొండబాబు (35), ధర్మరాజు (20), రాజు (25), వేణు (18)గా గుర్తించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రైవేటు బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు

7. యాపిల్‌ ఈవెంట్ జరిగేది అప్పుడేనా‌.. ఐఫోన్‌ 14, ఇంకా ఏం విడుదలవుతాయ్‌?

యాపిల్‌ ఐఫోన్‌ 14 విడుదల తేదీ, ధరపై నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏటా సెప్టెంబర్‌ నెల రెండో వారంలో యాపిల్ కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఈ ఏడాది మాత్రం సెప్టెంబరు 7న నిర్వహించే కార్యక్రమంలో ఐఫోన్‌ 14ను విడుదల చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐఫోన్‌ 14తోపాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8ను కూడా విడుదల చేయనుందట. ఇంతకీ, ఐఫోన్‌ 14ను ఎన్ని వేరియంట్లలో తీసుకొస్తున్నారు? వాటి ధరెంత ఉండొచ్చు వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మా నౌక ఏ దేశ భద్రతకు ముప్పుకాదు: చైనా

శ్రీలంకలోని హంబన్‌టోట రేవులో లంగరువేసిన  నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని చైనా సమర్థించుకొంది. ఆ నౌక ఏ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించదని.. అదే సమయంలో మూడో పక్షం అడ్డంకులు సృష్టించకూడదని చైనా పేర్కొంది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మాట్లాడుతూ.. శ్రీలంక చురుకైన సహకారంతో ‘యువాన్‌ వాంగ్‌-5’ నౌక విజయవంతంగా ఆ దేశంలో లంగరు వేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ 51 బిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లించలేని స్థితిలో శ్రీలంక ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య

తన ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ గురించి పెదవి విప్పారు నటుడు నాగచైతన్య (Naga Chaitanya). బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ (Sushmita Sen) అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. ‘ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు?.. ఏ నటీమణితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించగా..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అసలు ఏమిటీ ‘లైగర్‌’ ఫైట్‌..?

10. బైక్‌ను దొంగ ఎలా చోరీ చేశాడో చూడండి..!

నిర్మల్ జిల్లా బాసరలో ఓ దొంగ.. ద్విచక్రవాహనాన్ని కొట్టేశాడు. చోరీకి  సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని