Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Feb 2023 21:02 IST

1. జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత

పార్లమెంటులో ప్రధాని మోదీ (PM Modi) తన ప్రసంగంలో ‘అదానీ’ (Adani) అంశంపై జవాబు చెప్పలేదని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) అన్నారు. జాతీయవాదం ముసుగులో ప్రధాని దాక్కుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం అందించే సాయంపై పార్లమెంటులోనే ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నా ప్రశ్నలకు ప్రధాని నుంచి సమాధానం రాలేదు: రాహుల్‌

లోక్‌సభ(Lok sabha)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. అదానీ గ్రూప్‌(Adani group) వ్యవహారంపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెప్పలేదన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన బడ్జెట్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపిన తీర్మానంపై లోక్‌సభలో చర్చ అనంతరం ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం ప్రసంగించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్‌

తమ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అది కొందరిని బాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) అన్నారు. దేశ ప్రగతిని చూసి బాధపడేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ప్రతిపక్షాలనుద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్‌ (Parliament) బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్‌.. ‘100’ క్లబ్‌లో పుజారా

భారత్‌, ఆసీస్‌ (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభంకానుంది. తొలి టెస్టుకు నాగ్‌పుర్‌లోని వీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ చరిత్రాత్మక ట్రోఫీలో కొంతమంది టీమ్‌ఇండియా (Team India) క్రికెటర్లు పలు మైలురాళ్లను అందుకునే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ vs బ్యాంక్‌ ఎఫ్‌డీ.. ఏది బెటర్‌?

'ఆజాదీకా అమృత్‌ మహోత్సవం'లో భాగంగా మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని2023-24 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (Mahila Samman Saving Certificate Scheme) పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉండనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తల్లిదండ్రులైన ట్రాన్స్‌జెండర్ల జంట

మరికొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులం కాబోతున్నామని పేర్కొంటూ కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌ జంట (Transcouple) ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జంట ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. కొయ్‌కోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్‌జండర్లలో ఒకరైన జహాద్‌ బుధవారం (ఫిబ్రవరి 8న) ఉదయం బిడ్డకు జన్మనిచ్చారు. దేశంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ జంట తల్లిదండ్రులు కావడం ఇదే తొలిసారి అవడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తుర్కియేలో భారతీయులు సేఫ్‌.. ఒకరు మిస్సింగ్‌

తుర్కియే (Turkey) భూకంపంలో ఇప్పటివరకు 11 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించగా.. మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఒక వ్యక్తి జాడ మాత్రం తెలియడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భూకంపం (Earthquake) సంభవించిన మారుమూల ప్రాంతాల్లో మరో 10 మంది చిక్కుకున్నారని.. అయినప్పటికీ వారంతా క్షేమంగానే ఉన్నారని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తుర్కియేలో భూకంప పన్ను ఏమైంది..? ప్రజల ఆగ్రహం..!

తుర్కియే(Turkey), సిరియాలో ఎమకలు కొరికే చలి మధ్య భూకంప బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల్లో కలిపి 9,000 మంది మృతి చెందారు. ప్రతి గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. అధికారులు వేగంగా స్పందించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిరియాలో రెబల్స్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు సహాయ బృందాలు కూడా వెళ్లలేకపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గిల్‌ ఉంటాడా.. సూర్య వస్తాడా.. కీపర్‌ ఎవరు.. స్పిన్నర్‌ లెక్కేంటి?

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ (WTC Finals) బెర్త్‌, ర్యాంకింగ్స్‌లో మొదటి ప్లేస్‌... ఈ రెండు కీలక అంశాలను తేల్చే బోర్డర్‌ గావస్కర్‌ (Border Gavaskar Trophy) ట్రోఫీకి  రంగం సిద్ధమైంది. భారత్‌, ఆస్ట్రేలియా (India - Australia) మధ్య గురువారం (జనవరి 9) నాగ్‌పూర్‌లో తొలి టెస్టు (Nagpur Test) మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ ఇండియా తుది కూర్పు ఇలా ఉండొచ్చు అని వార్తలొస్తున్నాయి. క్రికెట్‌ విశ్లేషకుల అంచనాల ప్రకారం కంగారూలను ఢీకొట్టే 11 మంది భారతీయులు వీరే కావొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఏ ప్రాతిపదికన జాతీయ హోదా ఇస్తుందంటే..!

దేశంలో అనేక సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వాటిలో కొన్ని నిర్మాణ దశలో.. మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఒక రాష్ట్రం లేదా ప్రాంతం పురోగమించడానికి నీటిపారుదల ప్రాజెక్టులు(Irrigation Project) ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే వాటికి కేటాయించాల్సిన నిధులు కూడా భారీ మొత్తంలో ఉంటాయి. ఏదైనా ప్రాజెక్టుకు జాతీయహోదా(National Project) లభించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ సాయం అందుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని