Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Mar 2024 09:00 IST

1. ఓటరుగా సీఎం రేవంత్‌రెడ్డి పేరు

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో హోదాలో ఓటరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు నమోదైంది. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు తుది జాబితాను వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ తహసీల్దారు విజయకుమార్‌ విడుదల చేశారు. పూర్తి కథనం

2. ఇచ్చింది కొంత.. లెక్కల్లో వింత

వైకాపా అయిదేళ్ల పాలనలో ఎంత లబ్ధి చేకూరిందో తెలియజేస్తూ గడప గడపకు సంక్షేమం పేరిట ప్రభుత్వం జారీ చేసిన కరపత్రాలను చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. తమకు అందిన లబ్ధి కన్నా ఎక్కువ చేసి చూపడంతో ప్రశ్నిస్తున్నారు. ఇచ్చేందుకు ఇళ్ల వద్దకు వచ్చిన వాలంటీర్లను నిలదీస్తున్నారు. పూర్తి కథనం

3. గొర్రెల పంపిణీలో ‘క్యాష్‌బ్యాక్‌’ అట!

గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు ‘క్యాష్‌బ్యాక్‌’ ఇస్తానని ప్రచారం చేసిన ఓ ప్రైవేట్‌ వ్యక్తి.. అధికారులకు నజరానాలు అందించి విక్రయదారులకు చెల్లించాల్సిన సొమ్మును తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. అతనికి పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు సహకరించారని విజిలెన్స్‌ విచారణలో వెలుగులోకి వచ్చింది.పూర్తి కథనం

4. ఇంతకంటే.. విఫల సీఎం ‘కలరా’!

మనిషి జీవించేందుకు నీరు ఎంత అవసరమో... దాని నాణ్యత అంతకంటే ముఖ్యం. స్వచ్ఛమైన తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు. కనీస అవసరాల్లో అత్యంత కీలకమైన శుద్ధి చేసిన తాగునీటిని ప్రజలకు అందించడంలో జగన్‌ సర్కారు ఘోరంగా విఫలమైంది. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా కలుషిత నీటిని తాగుతూ అన్ని ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.పూర్తి కథనం

5. కప్పు సంబరం.. మళ్లీ ఎప్పుడో!

2008లో ఐపీఎల్‌ ఆరంభమైనపుడు.. అత్యంత సాధారణంగా కనిపించి, అంచనాలే లేకుండా బరిలోకి దిగిన జట్టు ఏదంటే రాజస్థాన్‌ రాయల్స్‌ పేరే వినిపించేది. కానీ ఎంతో బలంగా కనిపించిన జట్లు తుస్సుమనిపించిన ఆ సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ ఎగరేసుకుపోయింది రాజస్థాన్‌. ఇక అప్పట్నుంచి రాయల్స్‌ ప్రతిసారీ మంచి అంచనాలతో బరిలోకి దిగుతోంది. కానీ మరో టైటిల్‌ మాత్రం సాధ్యపడట్లేదు. మరి ఈసారైనా రాయల్స్‌ మెరుపులు మెరిపిస్తుందా? రెండో టైటిల్‌ కోసం సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందా?పూర్తి కథనం

6. మూత్రపిండం.. విఫలమైతే ప్రాణగండం

మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని వ్యర్థాలను శుద్ధిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఉపయోగపడతాయి. మూత్రాన్ని ఉత్పత్తి చేయడంలో, రక్తంలోని అనేక మూలకాల స్థాయిలను, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకోక తప్పదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణగండమేపూర్తి కథనం

7. కోడ్‌ కూసేలోపు.. రూ.7వేల కోట్ల రుణం!

రుణాల కోసం ఏ అవకాశాన్నీ జగన్‌ ప్రభుత్వం వదలట్లేదు. వీలైనంత తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతున్నా, ఈ లోపే రూ.7వేల కోట్ల రుణం తీసుకునే ప్రయత్నంలో పడింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రైవేటుబాండ్ల రూపంలో రూ.7వేల కోట్ల రుణం సమకూర్చుకునేందుకు శరవేగంగా దస్త్రాన్ని కదిపింది.పూర్తి కథనం

8. పెళ్లి పేరుతో భార్యాభర్తల మోసాలు.. అరెస్ట్‌

పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ అమాయక యువతులను మోసం చేస్తున్న వ్యక్తిని, సహకరిస్తున్న అతని భార్యను హైదరాబాద్‌ సీసీఎస్‌ స్పెషల్‌ జోనల్‌ క్రైమ్‌ టీమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ జి.వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ డి.భిక్షపతి తెలిపిన వివరాలివీ.. సిరిసిల్ల జిల్లా వెంకంపేట గ్రామానికి చెందిన యెలిగేటి రంజిత్‌ ఎలియాస్‌ యడ్ల శ్రీరాధాకృష్ణ ఎలియాస్‌ రాజేశ్‌ (35), భార్య సంధ్య పీర్జాదిగూడ  వినాయక్‌నగర్‌, రోడ్‌ నంబరు 4లోని ప్లాట్‌ 93లో అద్దెకుంటున్నారు. పూర్తి కథనం

9. కుందూలో జగన్నాటకం

జగన్‌ మాటలు నీటి మూటలయ్యాయి.. వంద పల్లెలను వరద పోటు నుంచి రక్షించే పనులు కాలేదు.. వందల ఎకరాలకు సాగు నీరిచ్చే రాజోలి, జొలదరాశి జలాశయాలకు పునాది పడలేదు. మూడేళ్ల కిందట విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినా పురోగతి కరవైంది. ప్రభుత్వం పైసా విడుదల చేయకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు.పూర్తి కథనం

10. స్వీయ ప్రమాద కేసుల్లో తొలిసారిగా రిమాండు

రోడ్డుపై ప్రయాణించే సమయంలో స్వీయ ప్రమాదాలకు (సెల్ఫ్‌ యాక్సిడెంట్‌) గురైతే వాటిని ఇన్నాళ్లూ పోలీసులు సర్వసాధారణ కేసులుగా పరిగణించేవారు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే నోటీసిచ్చి పంపేవారు. పశ్చిమ మండలంలోని జూబ్లీహిల్స్‌ ఠాణాలో జరిగిన రెండు స్వీయ ప్రమాద కేసుల్లో అయిదుగురు నిందితులను తొలిసారిగా రిమాండుకు పంపారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని