Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jan 2023 09:09 IST

1. ఆట దూకుడు.. ప్రేమ రాకుమారుడు!

చూడ్డానికి మిల్కీబాయ్‌లా ఉన్నా.. అతడు బ్యాటు పడితే విధ్వంసమే! 23 ఏళ్లకే వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదేసిన శుభ్‌మన్‌ గిల్‌ ఉపోద్ఘాతం ఇది. ఈ రికార్డుల వెనక బోలెడు కష్టం ఉంది. ఆ సంగతేంటో తెలుసుకుంటూనే..ఈ నయా సెన్సేషన్‌ కబుర్లు ఇంకొన్ని చెప్పుకుందాం. నాన్న స్ఫూర్తితో..: సెప్టెంబరు 8, 1999లో పంజాబ్‌లోని ఫజ్లీకా అనే చిన్న పట్టణం పక్కనున్న పల్లెటూరులో పుట్టాడు శుభ్‌మన్‌. తోటి పిల్లలంతా బొమ్మలు కావాలని మారాం చేస్తుంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అన్యాయం జరిగింది.. ఆపండి!

స్టాఫ్‌నర్స్‌ పోస్టుల కౌన్సెలింగ్‌లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు నిరసన తెలియజేశారు. కొవిడ్‌ కాలంలో పనిచేసిన ఎస్సీ అభ్యర్థులకు మార్కులు వేయడంలో, జాబితా పొందుపర్చడంలో తప్పిదాలు జరిగాయని, కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ జోన్‌- 1 పరిధిలో విశాఖ రామాటాకీస్‌ రోడ్డులోని ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్‌ ప్రారంభించగా.. ఉదయం 11 గంటల నుంచే ఈ నిరసన మొదలయింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ద్వారకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కుంభకోణం వెలుగులోకి వచ్చే ఏడాది ముందే రామలింగరాజును కలిశా: ఆనంద్‌ మహీంద్ర

‘సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ను విలీనం చేసుకునే ప్రతిపాదనతో ఆ కంపెనీ ఛైర్మన్‌ రామలింగ రాజును సంప్రదించాను. అయితే ఇది ఆ సంస్థ కుంభకోణం వెలుగులోకి వచ్చే ఏడాది ముందే జరిగింది. అయితే నా ప్రతిపాదనకు రామలింగరాజు నుంచి స్పందన రాలేదు. ఆ కంపెనీ ఖాతాల్లో పొరబాట్లు ఆయనకు ముందే తెలుసు కాబట్టే స్పందించలేదేమో’.. అని అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఓ పట్టు పట్టాల్సిందే..

వినతులు.. ప్రతిపాదనలతోనే కాలం గడచిపోతోంది. నిధుల ఊసేలేదు..దీంతో రైలు మార్గాల్లో ప్రగతి కూత ఆశించిన స్థాయిలో వినిపించడంలేదు. కొత్త మార్గాల ఏర్పాటు.. అనుసంధానం.. స్టేషన్లలో మౌలిక వసతులు, రైలు వంతెనలు ఇలా సుదీర్ఘ విన్నపాలకు ఏళ్లు గడుస్తున్నా మోక్షం దక్కడంలేదు. కేంద్ర మంత్రులను అడపాదడపా ఈ మూడు జిల్లాల ఎంపీలు కలిసి వినతులు అందిస్తున్నా.. బడ్జెట్‌ కేటాయింపులకొచ్చేసరికి రిక్తహస్తమే ఎదురవుతుండడం నిరుత్సాహపరుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆన్‌లైన్‌లో అనుమతి.. ఆమ్యామ్యాలతోనే పని

‘పట్టణంలోని ఆర్‌ఎన్‌టీనగర్‌కు చెందిన ప్రయివేటు ఉద్యోగి సుభాష్‌ గత నవంబరు 7న భవన నిర్మాణ అనుమతి రెన్యూవల్‌ కోసం టీఎస్‌బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ ఉద్యోగి నిర్మిత భవనాన్ని పరిశీలించి ధ్రువీకరించారు. బల్దియా ప్రణాళిక విభాగం ఉద్యోగి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా దరఖాస్తు తిరస్కరించడంతో అనుమతి నిలిపివేశారు. ఇదేంటని బల్దియా అధికారులను నిలదీస్తే మరోమారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండోసారి దరఖాస్తు చేస్తే రెవెన్యూ ఉద్యోగి తిరస్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చిల్లరే.. లెక్కేస్తే లక్షలే..!

ఉమ్మడి జిల్లాలో వంట గ్యాస్‌ సిలిండరు ధరపై అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గృహావసరాల గ్యాస్‌ సిలిండరు ధర బహిరంగ మార్కెట్‌కు అనుగుణంగా మారుతోంది. ఒక్కో నెలలో పెరుగుతూ, మరో నెలలో తగ్గుతూ ఉండటం వల్ల వాస్తవ ధర వినియోగదారులకు స్పష్టంగా తెలిసే పరిస్థితి ఉండటం లేదు. ఇదే ఎక్కువనుకుంటే.. సిలిండరు అసలు ధర కంటే.. ఇంటికి అందించే సమయంలో అదనంగా వసూలు చేస్తుండటం మరింత భారమవుతోంది. ఈ వసూళ్లు చిల్లరగా కనిపించినా.. నెలనెలా ఇది లక్షల్లో సాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కియాపై నాడు అక్కసు.. నేడు పొగడ్తలు

‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు... మా నోటికొచ్చింది మేం మాట్లాడతాం. రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మాట మార్చేస్తాం. మడమా తిప్పేస్తాం’... అంటున్నారు వైకాపా నాయకులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో ఉత్పత్తయిన ఒక మోడల్‌ కారుకు 2023 సంవత్సరానికి ‘ఇండియా కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రావడంతో ఆ కంపెనీపై పొగడ్తలు కురిపిస్తూ సాయిరెడ్డి చేసిన ట్వీట్‌ని, వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు అదే కియాపై తన కడుపుమంటనంతా ప్రదర్శిస్తూ చేసిన ట్వీట్‌నీ చూస్తే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత  నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్‌, కాలిక్యులేటర్‌, పర్సు, నోట్సు, ఛార్ట్‌లు, పేపర్లు, రికార్డింగ్‌ పరికరాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సలహాదారులు ఎందరున్నారో ప్రభుత్వానికే తెలియదు

రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో సలహాదారుల్ని ఎంత ఎడా పెడా నియమించిదంటే... ఎంత మంది సలహాదారులు ఉన్నారో ప్రభుత్వానికే తెలియనంత..! అవును వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం..! సలహాదారులు ఎంత మంది ఉన్నారో నివేదిక సమర్పించమని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఇప్పుడు తీరిగ్గా ఆ లెక్కలు తీస్తోంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సలహాదారుల వివరాలు సేకరిస్తోంది. సలహాదారుల పేర్లు, హోదా, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? వారికి ఎంత వేతనం చెల్లిస్తున్నారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లండన్‌ గోడలపై మూత్రం.. వెనక్కు చిమ్మడం ఖాయం!

హిరంగ మూత్ర విసర్జన.. జనావాసాల్లో ఇదొక తీవ్ర సమస్య. పరిసరాల అపరిశుభ్రతతోపాటు స్థానికులకు ఎంతో అసౌకర్యం. ముఖ్యంగా రేయింబవళ్లు జనసంచారం ఉండే నగరాలకు ఇది రోజూ తలనొప్పి వ్యవహారమే. ఈ నేపథ్యంలో.. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనను  కట్టడి చేసేందుకు గ్రేటర్‌ లండన్‌ పరిధి వెస్ట్‌ మినిస్టర్‌ సిటీ కౌన్సిల్‌ వినూత్న పరిష్కార మార్గాన్ని అవలంబిస్తోంది. ఇక్కడి సోహో ప్రాంతంలోని ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లోని బయటి గోడలపై నీటిని వికర్షించే పారదర్శక పెయింట్‌ను పిచికారీ చేయిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని