Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Mar 2024 09:09 IST

1. ‘అప్పు’నంగా ఖర్చు!

అప్పు చేసి పప్పు కూడు... అని సామెత! పాలనలో అప్పు చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ ఎందుకు అప్పు చేస్తున్నాం, వచ్చిన సొమ్ములతో ఏం చేస్తున్నామనేది కీలకం! రుణం తీసుకుని విందులు, వినోదాలకు ఖర్చు చేస్తే అది గుదిబండగా మారుతుంది. అలాకాకుండా దాంతో ఇల్లు నిర్మించుకుంటే కుటుంబానికి ఆస్తిగా మారుతుంది. ప్రతి కుటుంబానికీ ఈ విషయం తెలియంది కాదు. అర్థం కానిదీ కాదు. ఒక్క సీఎం జగన్‌కు తప్ప! పూర్తి కథనం

2. డీఎస్సీకి ముందే టెట్‌

డీఎస్సీ కంటే ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం, ఆ వెంటనే టెట్‌ నోటిఫికేషన్‌ జారీ కావడం జరిగిపోయాయి. మే 20 నుంచి జూన్‌ 3 మధ్యలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీటీ) జరగనున్నాయి. పూర్తి కథనం

3. ‘విశాఖ ఉత్తరం’ నుంచి పోటీ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని జై భారత్‌ పార్టీ అధ్యక్షులు, సీబీఐ పూర్వ జె.డి. వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఎంవీపీకాలనీ సెక్టారు-10లోని ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.పూర్తి కథనం

4. ఎల్‌ఆర్‌ఎస్‌.. నిబంధనలు తుస్‌

మావల మండలం బట్టిసావర్గాం శివారు పరిధిలోకి వచ్చే సర్వే నెం.72/3 లోని ఈ స్థలంలో కొన్ని రోజులుగా రహదారులు, మురుగు కాలువల నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కొత్తగా నిర్మించే జిల్లా సమీకృత భవన సముదాయం (కలెక్టరేట్‌ భవనానికి) ఆనుకొని ఉన్న పదెకరాల ఈ అసైన్డ్‌ భూమికి 13 ఏళ్ల కిందట ఆర్డీఓ నుంచి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ అయింది. ఆ తరువాత అదనపు పాలనాధికారి(జాయింట్‌ కలెక్టర్‌) ఆ ఎన్‌ఓసీని రద్దు చేశారు.పూర్తి కథనం

5. నేను ఓడిపోయినా పర్వాలేదు: మంత్రి ధర్మాన

ఎన్నికల్లో తాను ఓడిపోయినా పర్వాలేదంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో గురువారం జరిగిన కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘జిల్లా, నగర కళింగ వైశ్య సంఘ నాయకులు వైకాపాను గెలిపించాలనుకోవడం సంతోషం.పూర్తి కథనం

6. ఏయ్‌ మాట్లాడకు.. నోరు మూసుకో..

మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తనను ప్రశ్నించే వారిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో గురువారం వేర్వేరు గ్రామాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో తునివలస గ్రామంలో జరిగిన సభలో స్థానికులు కాలువ పనుల విషయమై ఎమ్మెల్యేను నిలదీశారు.పూర్తి కథనం

7. ఎలివేటెడ్‌ కారిడార్‌.. పుష్కరం క్రితమే కట్టాలనుకున్నా..

ప్యారడైజ్‌ కూడలి నుంచి డెయిరీ ఫాం రోడ్డు వరకు దూరం తక్కువే అయినా కంటోన్మెంట్‌లో ఇరుకుదారులతో నిత్యం ట్రాఫిక్‌ కష్టాలే. దీన్నుంచి బయటపడేందుకు ఈ మార్గంలో 4.650 కి.మీ. పొడవునా డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు ఇటీవల సర్కారు శంకుస్థాపన చేసింది. పూర్తి కథనం

8. ఎవరు.. ఏ పార్టీకి ఓటేస్తారు?.. గుట్టుగా సర్వే చేయాలని సందేశాలు

ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రస్తుతం వాలంటీర్లతో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ అంశాలపై పలు నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారు. ఇప్పటికే అనేక సర్వేలు, వైకాపా ప్రచార కరపత్రాలు ఇంటింటికీ పంపిణీ చేయించగా, తాజాగా మరో సర్వే చేయాలని బుధవారం రాత్రి అధికారుల నుంచి వాలంటీర్లకు సందేశాలు వచ్చాయి.పూర్తి కథనం

9.ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...

వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి.మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు బీమా సంస్థలు విస్తృత రక్షణను అందించే ఉత్పత్తులు, సేవలను నిరంతరం రూపొందిస్తున్నాయి. బీమా సంస్థలు అనుబంధ పాలసీలతో వీటిని అందిస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి ‘హాస్పిటల్‌ డైలీ క్యాష్‌’.పూర్తి కథనం

10. ఒంటి పూట..కనిపెట్టాలి ఓ కంట!

ఒక్క పూట బడులంటే పిల్లలకు భలే సరదా... చిందులు, సరదాలు.. ఉరకలేసే సమయమిది... ఆనందంతో పాటు జాగ్రత్తలు అవసరం సుమా! వేసవిలో ఒంటి పూట బడులు ఎంత సరదాను తెచ్చిపెడతాయో.. అజాగ్రత్తతో ఉంటే అంతకుమించి రెట్టింపు ప్రమాదాలు జరుగుతాయి.. అలవాట్లు., ఆహారం, ఆరోగ్యం, చదువు.. తదితర అంశాలను ఓ ప్రణాళిక ప్రకారం చేసుకుంటే ప్రయోజనం.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు