ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి.
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి.మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు బీమా సంస్థలు విస్తృత రక్షణను అందించే ఉత్పత్తులు, సేవలను నిరంతరం రూపొందిస్తున్నాయి. బీమా సంస్థలు అనుబంధ పాలసీలతో వీటిని అందిస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి ‘హాస్పిటల్ డైలీ క్యాష్’. వైద్య పరమైన అత్యవసర పరిస్థితుల్లో ఒక అదనపు రక్షణను ఇది కల్పిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం...
ఆసుపత్రిలో చేరినప్పుడు ఒక్క చికిత్స ఖర్చే కాదు.. దీనికి అనుబంధంగా ఎన్నో ఉంటాయి. సాధారణంగా ఈ వ్యయాలకు బీమా కంపెనీ ఎలాంటి చెల్లింపులూ చేయవు. ఇలాంటప్పుడే హాస్పిటల్ డైలీ క్యాష్ కవర్‌లాంటి అనుబంధ పాలసీలు తోడుంటాయి. పేరులో సూచించినట్లే.. ఆసుపత్రిలో చేరినప్పుడు రోజుకు నిర్ణీత మొత్తాన్ని అందించేందుకు బీమా సంస్థలు రూపొందించిన అనుబంధ ఆరోగ్య బీమా పాలసీ ఇది. చికిత్స కోసం వాస్తవంగా అయిన మొత్తాన్ని ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ చెల్లిస్తుంది. దీనికి అనుబంధంగా తీసుకునే ఈ పాలసీ.. ముందుగానే నిర్ణయించిన మొత్తాన్ని ఆసుపత్రిలో ఉన్నన్నినాళ్లు రోజువారీ భత్యాన్ని అందిస్తుంది. ఇది ఆసుపత్రి బిల్లులకు అదనం. ఉదాహరణకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు రోజుకు రూ.500 చెల్లించేలా ఈ అనుబంధ పాలసీని ఎంచుకున్నారనుకుందాం. అప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నన్ని రోజులూ రూ.500 చొప్పున చెల్లిస్తుంది. ఖర్చులు రూ.800 అయినా.. రూ.400 అయినా పాలసీకి అవసరం లేదు. మీరు నిర్ణయించుకున్న మొత్తాన్ని చెల్లించడం దీని ప్రత్యేకత. దీన్ని విడిగానూ తీసుకునే అవకాశాన్ని కొన్ని బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. ప్రాథమిక పాలసీకి అనుబంధంగా జోడించుకుంటే.. రోజువారీ నగదు పరిమితి పాలసీ విలువలో 1 శాతం వరకూ ఉండవచ్చు. లేదా స్థిరంగా ఇంత మొత్తం అందిస్తామనే నిబంధనతోనూ రావచ్చు. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలాగానే దీన్నీ జీవిత కాలం పాటు పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈ అనుబంధ పాలసీని తీసుకునేందుకు చాలా స్వల్ప ప్రీమియం చెల్లిస్తే చాలు.
అర్థం చేసుకోవాలి...
రోజువారీ ఎంత మొత్తం చెల్లించాలి అనేది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. బీమా పాలసీని తీసుకునేటప్పుడు ఇచ్చిన ఎంపికల నుంచీ ఎంచుకోవచ్చు. ఈ మొత్తం సాధారణంగా రోజుకు రూ.500 నుంచి కొన్ని వేల రూపాయల వరకూ ఉండొచ్చు. ఏదైనా క్లిష్ట సమస్యతో ఐసీయూలో చేరాల్సి వస్తే.. రోజువారీ నగదు భత్యం కొన్ని రోజులకు రెట్టింపు లభిస్తుంది. ఉదాహరణకు రోజువారీ చెల్లించే నగదు రూ.1,000 ఉందనుకుందాం. ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పుడు ఇది రూ.2,000 అవుతుంది. పాలసీ నిబంధనలకు లోబడి ఇది ఆధారపడి ఉంటుంది.
షరతులు తెలుసుకోవాలి
సంప్రదాయ ఆరోగ్య బీమా పాలసీల మాదిరిగానే, ఆసుపత్రి రోజువారీ నగదు ఖర్చులు చెల్లించేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ముఖ్యంగా వేచి ఉండే వ్యవధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రిలో చేరినప్పుడు తప్పనిసరిగా 24 గంటలను మించి ఉండాలి. కొన్ని రోజువారీ చికిత్సల కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ చికిత్సలు ఈ పాలసీ పరిధిలోకి రాకపోవచ్చు. ఏడాది కాలంలో గరిష్ఠంగా 30 నుంచి 90 రోజులపాటే ఈ రోజువారీ నగదు చెల్లింపు ఉంటుంది. కాబట్టి, పాలసీ నిబంధనలు ముందుగానే తెలుసుకోవడం తప్పనిసరి.
అవసరమేమిటి?
- ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. కుటుంబ సభ్యులకు ఆహారం, ప్రయాణ ఖర్చుల్లాంటివి సొంతంగా భరించాల్సిందే. హాస్పిటల్ డైలీ క్యాష్ కవర్ తీసుకున్నప్పుడు ఈ అదనపు ఖర్చుల భారాన్ని తగ్గిస్తుంది. ఈ పాలసీ చెల్లించిన మొత్తాన్ని మీ ఇష్టానుసారం వినియోగించుకునే వీలుంది.
- మీ ఆరోగ్య బీమా మొత్తానికి మించి క్లెయిమ్ ఉంటే, హాస్పిటల్ డైలీ క్యాష్ కవర్ కొంత అదనపు రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల మీ చేతి నుంచి భరించే మొత్తం తగ్గుతుంది.
- అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు ఎన్నో ఊహించని ఖర్చులు ఉంటాయి. వీటిని కొంతలో కొంత తట్టుకునేందుకు డైలీ క్యాష్ కవర్ పాలసీ తోడ్పడుతుందని చెప్పొచ్చు. ఈ అనుబంధ పాలసీని మీ ప్రాథమిక పాలసీకి తోడుగా తీసుకోవడం వల్ల ఆర్థికంగా కాస్త వెసులుబాటు దొరుకుతుంది.
- ఆశిష్ సేథి, హెడ్, హెల్త్, ట్రావెల్, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్