బోరుబావిలో పడిన చిన్నారి.. రాత్రంతా శ్రమించి కాపాడిన రెస్క్యూ టీమ్‌

బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారిని రెస్క్యూ టీమ్‌ కాపాడింది. దాదాపు 9 గంటలపాటు శ్రమించి బయటకు తీసుకొచ్చింది.

Updated : 07 Feb 2024 08:52 IST

జామ్‌నగర్‌: బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారిని రెస్క్యూ టీమ్‌ కాపాడింది. దాదాపు 9 గంటలపాటు శ్రమించి బయటకు తీసుకొచ్చింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జిల్లా గోవానా గ్రామంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. ఘటనపై జిల్లా యంత్రాంగానికి సమాచారం అందడంతో రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది. రాత్రంతా సహాయక చర్యలు చేపట్టి బుధవారం తెల్లవారుజామున బాలుడిని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం వెంటనే జామ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అగ్నిమాపక శాఖ నుంచి రెండు బృందాలు, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు పాల్గొన్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని