హోల్‌సేల్‌ మద్యం షాపుల్లో ఆ యాప్‌ వాడాల్సిందే!

దేశ రాజధాని నగరంలో రోజురోజుకీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఆప్‌ ప్రభుత్వం వైరస్‌ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. నగరంలోని అన్ని హోల్‌సేల్‌ మద్యం దుకాణాల వ్యాపారులు ........

Published : 01 Nov 2020 01:18 IST

దిల్లీ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు

దిల్లీ: దేశ రాజధాని నగరంలో రోజురోజుకీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఆప్‌ ప్రభుత్వం వైరస్‌ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. నగరంలోని అన్ని హోల్‌సేల్‌ మద్యం దుకాణాల యజమానులు తమ సిబ్బంది తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను వాడేలా చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశించింది. అలాగే, ఆయా దుకాణాల వద్ద శానిటైజర్‌ డిస్పెన్సర్లతో పాటు కరోనా నియంత్రణ  ప్రమాణాలను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది. నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయో లేదో పరిశీలించాలని బాండ్‌ ఇన్‌స్పెక్టర్లను ఎక్సైజ్‌శాఖ ఆదేశించింది. దీనిపై ఓ నివేదిక ఇవ్వాలని కోరింది.

ఆయా దుకాణాల వద్ద పాటించాల్సిన చర్యలపై ఇటీవల ఎక్సైజ్‌ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ జారీ చేసింది. దుకాణం ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద టచ్‌ ఫ్రీ శానిటైజర్‌ డిస్పెన్సర్లు ఉంచాలని ఆదేఅఇంచింది. అలాగే, కరోనాపై అవగాహన కల్పించే బ్యానర్లు ఆయా భవనాల వద్ద ఏర్పాటు చేయాలని పేర్కొంది. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించింది. సరకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయాల్లో భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్‌లను ధరించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని