ఒకటి, రెండు రోజుల్లో రైతులతో కేంద్రం భేటీ

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ భేటీ కానున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు....

Published : 21 Dec 2020 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ త్వరలో భేటీ కానున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉందని అమిత్‌షా బెంగాల్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు. అయితే స్పష్టమైన తేదీని తాను చెప్పలేనని అన్నారు. 

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన నిరసనలు నేటితో 26వ రోజుకు చేరాయి. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నా రైతులు పట్టువిడవకుండా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. రైతులు, ప్రభుత్వం మధ్య మలుమార్లు చర్చలు జరిగినా అవి ఫలించలేదు. చట్టాల్లో కొన్ని మార్పులు మాత్రమే చేపడతామని ప్రభుత్వం పేర్కొంటుండగా, వాటిని పూర్తిగా రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా రైతులు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతిరోజు 11 మంది నిరశన దీక్ష చేపట్టనున్నట్లు ఓ రైతు సంఘం ప్రతినిధి వెల్లడించారు. కాగా.. రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్రం నిన్న ఆహ్వానం పంపింది. చర్చలకు అనుకూలమైన తేదీని నిర్ణయించాలని అన్నదాతలను కోరింది. దీనిపై రైతు సంఘాలు నేడు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. 

ఇవీ చదవండి...

దిల్లీ శివార్లలో రైతన్నల రిలే నిరాహార దీక్ష

కర్షకా.. మీ వెంట మేమున్నాం!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని