యూఎస్‌ ఎన్నికల్లో జోక్యం వద్దని అప్పుడే చెప్పారు!

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గహ్లాత్‌ భిన్నంగా స్పందించారు. డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ గెలుపును అదనుగా చేసుకుని ఆయన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి చురకలంటించారు.

Published : 08 Nov 2020 22:45 IST

జైపుర్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గహ్లోత్‌ భిన్నంగా స్పందించారు. డెమొక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ గెలుపును అదనుగా చేసుకుని ఆయన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి చురకలంటించారు. యూఎస్‌ అంతర్గత రాజకీయాల్లో తలదూర్చవద్దు అంటూ కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ.. ప్రధాని నరేంద్రమోదీకి ఇచ్చిన సలహా కరెక్టేనని నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ మేరకు అశోక్‌ గహ్లోత్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘అప్పట్లో యూఎస్‌ అంతర్గత రాజకీయాల్లో మోదీని తలదూర్చవద్దని కాంగ్రెస్‌ నేత రాహుల్‌.. విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సూచించారు. ఆ సలహా ప్రాధాన్యత ఇప్పుడు అమెరికా ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపితమైంది. కొవిడ్‌ సహా ఇతర సున్నితమైన విషయాల్లోనూ మోదీకి రాహుల్‌ ఇచ్చిన సలహాలు ఎంతో ప్రశంసించదగినవి’ అని గహ్లోత్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని