Air India: వేడెక్కిన సెల్‌ఫోన్.. విమానం అత్యవసర ల్యాండింగ్‌

ఎయిరిండియా (Air India) విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్‌ అయింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రయాణికుల్లో ఒకరి సెల్‌ఫోన్ పేలడంతో పైలట్‌ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. 

Updated : 17 Jul 2023 22:47 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ నుంచి దిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా ఫ్లైట్‌ 470 విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రయాణికుల్లో ఒకరు తమ ఫోన్ ఓవర్‌హీట్ కావడం గుర్తించారు. ఈ విషయమై క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని పైలట్‌ ఉదయ్‌పూర్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాంకేతిక సిబ్బంది తనిఖీ చేసిన అనంతరం విమానం తిరిగి దిల్లీకి బయల్దేరినట్లు వెల్లడించారు.ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. 

Supreme Court: తర్వాత రాజధాని రైలునూ షెడ్యూల్‌ చేయమంటారా? వందే భారత్‌ పిటిషన్‌పై సుప్రీం అసహనం

ఇటీవలి కాలంలో సాంకేతిక లోపం కారణంగా విమానాలు అత్యవసర ల్యాండింగ్ అవుతున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో దిల్లీ-దెహ్రాదూన్‌ ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్ అయింది. అంతకుముందు ముంబయి​ నుంచి బెంగళూరు పయనమైన ఎయిరిండియా విమానం.. గాల్లో ఉండగానే ఓ ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో అత్యవసరంగా మళ్లీ ముంబయి ఎయిర్‌పోర్టులో దిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని