Akhilesh Yadav: 2024 ఎన్నికల్లో ‘పీడీఏ’దే హవా : అఖిలేశ్‌

2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘పీడీఏ’ దే హవా అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పేర్కొన్నారు

Updated : 22 Oct 2023 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌- సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వివాదం నడుస్తోన్న వేళ.. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో విపక్ష కూటమిపై నీలినీడలు కమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమి ‘ఇండియా’పై వరుసగా విమర్శలు గుప్పిస్తోన్న వేళ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘పీడీఏ’ దే హవా అంటూ సోషల్‌ మీడియాలో పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది.

‘మిషన్‌ 2024. నేతాజీ (ములాయం సింగ్‌ యాదవ్‌) అమరుడు. వచ్చే ఎన్నికల్లో పీడీఏ విజయం సాధిస్తుంది. అఖిలేశ్ యాదవ్‌ పేదలకు న్యాయం చేస్తాడు’ అని ఓ యువకుడు శరీరంపై రాసుకున్నాడు. ఇలా ఒంటిపై సమాజ్‌వాదీ పార్టీ రంగులు (ఎరుపు, ఆకుపచ్చ) పులుముకున్న యువకుడి ఫొటోను షేర్‌ చేసిన అఖిలేశ్‌ యాదవ్‌.. ‘2024లో ఎన్నికలు ఉన్నాయి. పీడీఏదే హవా’ అంటూ వ్యాఖ్యానించారు. పీడీఏ అంటే.. పిచ్‌డే (వెనుకబడిన వర్గాలు), దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు అని అర్థం.  

Azam Khan: ‘ఎన్‌కౌంటర్‌ కావొచ్చేమో’.. వేర్వేరు జైళ్లకు తండ్రీ, కుమారుడు!

రాష్ట్ర స్థాయిలో పొత్తులు పని చేయవని ముందే చెబితే ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉండేవారమని ఇటీవల ఆయన పేర్కొన్న విషయం తెలిసింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి కాంగ్రెస్‌ ఒక్కసీటు కూడా ఇవ్వకపోవడం తాజా వివాదానికి కారణమయ్యింది. దీంతో కాంగ్రెస్‌ 18 చోట్ల అభ్యర్థులను దించింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అఖిలేశ్‌ యాదవ్‌.. ఇండియా కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని