Anand Mahindra: విమానంతో విల్లా.. ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌

Anand Mahindra: పాడుబడ్డ బోయింగ్‌ 737 విమానాన్ని విలాసవంతమైన విల్లాగా మార్చిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు.

Updated : 18 Feb 2024 15:58 IST

Anand Mahindra | ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో వినూత్నంగా, ఆసక్తి కలిగించే ప్రతి విషయాన్ని తన ఫాలోవర్లతో పంచుకోవడంలో ముందుంటారు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra). పాడుబడ్డ బోయింగ్‌ 737 విమానాన్ని ప్రైవేట్‌ లగ్జరీ విల్లాగా మార్చిన వీడియోను తాజాగా..  ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ఇలాంటి నవీన ఆలోచనకు కార్య రూపం ఇచ్చిన వ్యక్తిని ప్రశంసించారు.

రష్యాకు చెందిన ఫెలిక్స్‌ డెమిన్‌ పాడుబడ్డ బోయింగ్‌ 737 విమానాన్ని విలాసవంతమైన విల్లాగా మార్చాడు. అందులో రెండు పడక గదులు, స్విమ్మింగ్‌ పూల్‌, విలాసవంతమైన హోటల్‌ ఉంది. కాక్‌పిట్‌ను బాత్‌రూమ్‌లా మార్చాడు. ఇలా విమానంలో ప్రతి స్థలాన్ని తనకు నచ్చినట్లు ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. సముద్రపు ఒడ్డున నిర్మించిన విల్లాలోని ప్రత్యేకతలు, ఆశ్చర్యపరిచే విషయాలన్నింటినీ ఓ వీడియోగా తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశాడు.

భారత్‌ అభివృద్ధిని ప్రపంచం గుర్తిస్తోంది: మోదీ

ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు. ‘సమాజంలో కొందరు వ్యక్తులు మాత్రమే కలల్ని సాకారం చేసుకొనే అదృష్టం కలిగి ఉంటారు. ఈ వ్యక్తి మాత్రం తన కలలపై ఎలాంటి పరిమితులు విధించినట్లు కనిపించడం లేదు.  ఇక్కడ బస చేయాలని ఆసక్తి కలుగుతుందో లేదో చూడాలి’ అంటూ మహీంద్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మహీంద్రా షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 53 లక్షలకు పైగా వీక్షించారు. పాత విమానాన్ని అద్భుతమైన విల్లాగా మార్చిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని