Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
విద్యా సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది.

ఈనాడు, దిల్లీ: విద్యా సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. యూజీసీ (ఇన్‌స్టిట్యూషన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్) రెగ్యులేషన్-2023 పేరుతో రూపొందించిన ఈ నిబంధనలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి శుక్రవారం దిల్లీలో విడుదల చేశారు. విశ్వవిద్యాలయాల నాణ్యత, సామర్థ్యంపై దృష్టి సారించి పరిశోధన వాతావరణాన్ని బలోపేతం చేయడానికి సరళీకరించిన ఈ నిబంధనలు దోహదపడతాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 2019నాటి నిబంధనలను రద్దు చేసి ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఇవి తేలిగ్గా కనిపించినా కఠినంగా ఉంటాయని చెప్పారు.
* డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకొనే సంస్థలకు వరుసగా మూడేళ్లపాటు 3.01 సీజీపీఏతో న్యాక్-ఏ గ్రేడ్ కానీ, ఆ సంస్థలు నిర్వహించే కోర్సుల్లో రెండో వంతుకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్ కానీ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ రూపొందించిన ప్రత్యేక కేటగిరీ ర్యాంకుల్లో టాప్-50లో కానీ, ఓవరాల్ ర్యాంకుల్లో టాప్-100లో కానీ ఉండాలి.
* సముదాయంగా విద్యా సంస్థలను నడుపుతున్న వ్యవస్థ కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* విద్యాలయాలను స్పాన్సర్ చేస్తున్న సంస్థలు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిపుణుల కమిటీ అక్కడున్న సౌకర్యాలు, పత్రాలను పరిశీలించి, భాగస్వాములతో మాట్లాడి తుది నిర్ణయం వెలువరిస్తుంది. ఇదంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతుంది.
* కనీసం ఏ, అంతకుమించి గ్రేడ్‌లు పొందిన డీమ్డ్ యూనివర్సిటీలు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో యూనివర్సిటీల కేటగిరీలో 1 నుంచి 100 ర్యాంకులు పొందిన సంస్థలు ఆఫ్ క్యాంపస్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన సంస్థలు ఆ హోదా పొందిన 5 ఏళ్ల తర్వాత ఆఫ్ క్యాంపస్ సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* న్యాక్‌లో ఏ కంటే తక్కువ గ్రేడ్ పొందిన సంస్థలు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో 100కిపైన ఉన్న సంస్థల పని తీరును యూజీసీ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆ కమిటీ చేసిన సూచనల ప్రకారం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే కొత్త కోర్సులు ప్రారంభానికి ఇచ్చిన అనుమతులు రద్దుచేస్తారు.
* డీమ్డ్ యూనివర్సిటీలు ప్రారంభించే కోర్సులు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌ఎంసీ పరిధిలోకి వచ్చేట్లయితే రుసుములు, సీట్ల విషయంలో ఆయా సంస్థలు నిర్దేశించే నియమాలనే పాటించాలి.
* సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు డీమ్డ్ యూనివర్సిటీలు రుసుముల్లో రాయితీలు, ఉపకారవేతనాలతో పాటు సీట్లు కేటాయించొచ్చు.
* డీమ్డ్ యూనివర్సిటీలు తప్పనిసరిగా విద్యార్థులకు అకడెమిక్ క్రెడిట్స్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆ స్కోర్‌ను వారి డిజిటల్ లాకర్స్‌లో భద్రపరచాలి. ఈ విద్యాసంస్థలు ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లు, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు విద్యార్థులకు ఆఫర్ చేయొచ్చు.
* ప్రవేశాల ప్రారంభానికి కనీసం 60 రోజుల ముందు ఈ సంస్థలు యూనివర్సిటీల ప్రాస్పెక్టస్‌ను తమ వెబ్‌సైట్‌లో ఉంచాలి. రుసుములు, వాటి రీఫండ్ విధానం, ఒక్కో కోర్సులో ఉన్న సీట్లు, ప్రవేశార్హతలు, ప్రవేశ ప్రక్రియ గురించి అందులో స్పష్టంగా చెప్పాలి. విద్యార్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వివరాల రికార్డును తప్పనిసరిగా నిర్వహించాలి. ఆ రికార్డులను వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి. కనీసం అయిదేళ్లపాటు వాటిని భద్రపరచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్