Sukesh Chandrashekhar: 81 మంది దిల్లీ జైలు సిబ్బందికి సుఖేష్‌ నుంచి లంచాలు..!

మోసగాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ దిల్లీలోని రోహిణి జైలు సిబ్బందికి భారీ ఎత్తున లంచాలు ఇచ్చాడు. సుఖేష్‌ దగ్గర సొమ్ము తిన్న అధికారుల జాబితా భారీ

Published : 10 Jul 2022 14:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోసగాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ దిల్లీలోని రోహిణి జైలు సిబ్బందికి భారీ ఎత్తున లంచాలు ఇచ్చాడు. సుఖేష్‌ దగ్గర సొమ్ము తీసుకున్న అధికారుల జాబితా భారీగానే ఉంది. అతడు ఆ ధైర్యంతోనే జైల్లో ఉంటూనే మోసాలకు పాల్పడినట్లు సమాచారం. అధికారులే అతడికి మొబైల్‌ ఫోన్లు, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు గుర్తించారు. సదరు జైల్లోని 81 మందికిపైగా అధికారులకు సుఖేష్‌ నుంచి డబ్బు అందింది. ఈ మేరకు దిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.

పరిచయస్థులకు సమాచారం పంపేందుకు సుఖేష్‌ జైల్లోని నర్సింగ్‌ సిబ్బందిని వాడుకొన్నట్లు ఈ నెల మొదట్లో ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అతడు మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి తిహాడ్‌ జైల్లో ఉన్నాడు. తిహాడ్‌ జైలు సిబ్బంది తన వద్ద నుంచి రెండేళ్లలో రూ.12.5 కోట్లు వసూలు చేశారని సుఖేష్‌ ఇటీవల ఆరోపించాడు. తనకు ప్రాణ హాని ఉందని.. జైలు సిబ్బంది నిరంతరం బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తూ సుఖేష్‌, అతడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

కేవలం ఫోన్ల సాయంతో ఏడాదిలో రూ.200 కోట్లను మోసపూరితంగా సంపాదించాడు సుఖేష్‌. ఈ మోసగాడి బాధితుల్లో అత్యధిక మంది వీవీఐపీలే. సుఖేష్‌ క్రిమినల్‌ బ్రెయిన్‌ చూసి అధికారులే విస్తుపోయారు. మోసపూరితంగా సంపాదించిన సొమ్ముతో సినీతారలకు గాలం వేసి విలాసవంతమైన జీవితం గడిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని