Delhi Liquor Scam: దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియా అరెస్టు
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
దిల్లీ: మద్యం కుంభకోణం కేసు(Delhi liquor scam)లో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా(Manish sisodia) అరెస్టయ్యారు. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ(CBI) విచారణకు వెళ్లిన ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు సిసోదియాను దాదాపు 8 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.
విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో సిసోదియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దినేశ్ అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీశారు. వివిధ సందర్భాల్లో చేసిన ఫోన్ కాల్స్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అయితే, మనీశ్ సిసోదియా సమాధానాలతో తృప్తి చెందని సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేశామని చెబుతున్నారు. సిసోదియా నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలంటే కస్టోడియల్ విచారణ అవసరమని అన్నారు.
మరోవైపు సీబీఐ విచారణకు ముందు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘‘నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నా. విచారణకు పూర్తిగా సహకరిస్తా. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సి వచ్చినా.. లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారని సిసోదియాకు ముందుగానే అర్థమైనట్లు తెలుస్తోంది.
ఈ కేసులో సిసోదియాను సీబీఐ గతంలోనూ విచారించింది. దిల్లీ మద్యం కుంభకోణంలో సిసోదియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సిసోదియా సన్నిహితుడైన విజయ్ నాయర్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, సమీర్ మహేంద్రు సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ (CBI) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అటు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది.
- మనీశ్ సిసోదియా అరెస్టు నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు.
- మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
-
దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితర ఆప్ కీలక నేతలు సిసోదియా నివాసానికి వెళ్లారు.
-
ఈ రోజు రాత్రికి సిసోదియాకు సీబీఐ అధికారులు వైద్య పరీక్షలు చేయించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారం(Prajwal Revanna sex abuse case) కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. -
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్‌లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్‌గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్‌గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్‌కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్‌పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్‌లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్‌గా
-
‘ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్