రూ.2 కోట్లు చెల్లించాలి: పరువు నష్టం కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బ

పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలంటూ తెహల్కా, దాని మాజీ ఎడిటర్ ఇన్‌ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. 2001లో ఆ మీడియా సంస్థ ప్రచురించిన వార్తా కథనమే ఇందుకు కారణమైంది. 

Published : 22 Jul 2023 16:33 IST

దిల్లీ: పరువు నష్టం కేసులో తెహల్కా(Tehelka) పత్రిక మాజీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్ తరుణ్‌ తేజ్‌పాల్‌(Tarun Tejpal)కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తెహల్కా పత్రిక, తరుణ్ తేజ్‌పాల్‌తో పాటు మరో ఇద్దరు పాత్రికేయులు రెండు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ దిల్లీ హైకోర్టు(Delhi High Court) ఆదేశించింది. 2002లో మేజర్ జనరల్‌ ఎంఎస్‌ అహ్లూవాలియా ఈ పరువు నష్టం కేసు వేశారు.

రక్షణరంగానికి సంబంధించి కొనుగోలు ఒప్పందాల్లో అహ్లూవాలియా మధ్యవర్తిగా వ్యవహరించి అవినీతికి పాల్పడ్డారంటూ 2001లో తెహల్కా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కేసుకు సంబంధించి వాదనలు విన్న కోర్టు.. రూ. రెండు కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఈ తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలతో అహ్లూవాలియా ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. ఆయనపై వచ్చిన వార్తలు తప్పని తేలినప్పటికీ.. ఆయన అనుభవించిన వేదనను మాత్రం నయం చేయలేవంటూ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని