Maharashtra crisis: సుప్రీం తీర్పు.. బాలా సాహెబ్‌ సాధించిన హిందుత్వ విజయం: ఏక్‌నాథ్‌ శిందే

సుప్రీం కోర్టులో రెబల్ ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట లభించడంతో వారికి నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) తాజాగా స్పందించారు.

Published : 27 Jun 2022 23:17 IST

ముంబయి: సుప్రీం కోర్టులో రెబల్ ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట లభించడంతో వారికి నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) తాజాగా స్పందించారు. సుప్రీం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది బాలాసాహెబ్ ఠాక్రే (Balasaheb Thackeray) హిందుత్వ సాధించిన విజయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

‘‘బాలాసాహెబ్‌ ఠాక్రే హిందుత్వ విధానాలను, ధర్మవీర్‌ ఆనంద్‌ దిఘే సాహెబ్‌ల ఆలోచనలను అనుసరించే హిందువుల విజయం’’ అని శిందే ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో శివసేన అసలైన వారసులమని ఆయన చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. మరోవైపు, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లను వీడి అసలైన హిందుత్వ సిద్ధాంతాలున్న భాజపాతో తిరిగి పొత్తు పెట్టుకోవాలని శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు తమ ప్రధాన డిమాండ్‌గా పేర్కొంటున్నారు. అయితే, ఇది కేంద్రంలోని భాజపా నిర్దేశం ప్రకారమే జరుగుతుందని ఠాక్రే వర్గం ఆరోపిస్తూ వస్తోంది.

కాగా.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత వేటు నోటీసులను సవాల్‌ చేస్తూ ఏక్‌నాథ్‌ శిందే వర్గం వేసిన పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ మహారాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అనర్హత నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు శిందే వర్గానికి జులై 11 వరకు గడువు కల్పిస్తూ విచారణను వాయిదా వేసింది. అప్పటిదాకా వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని