మదురైలో జల్లికట్టు.. 32మందికి గాయాలు

మకర సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టులో 32 మంది గాయపడ్డారు. మదురైలోని అవనియాపురంలో క్రీడలో భాగంగా ఎడ్లను ఆపేందుకు చేసే ప్రయత్నంలో..........

Published : 15 Jan 2020 15:43 IST

మదురై: మకర సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టులో 32 మంది గాయపడ్డారు. మదురైలోని అవనియాపురంలో క్రీడలో భాగంగా ఎడ్లను ఆపేందుకు చేసే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ సంప్రదాయ క్రీడల్లో 2 వేలకు పైగా ఎద్దులు పాల్గొననున్నాయి. అవనియపురంలో 730, అలంగనల్లూరులో 700, పాలమేడులో 650 ఎద్దులు జల్లికట్టులో తలపడనున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని