రీషెడ్యూలింగ్‌ ఛార్జీలు రద్దు: ఎయిర్‌ ఇండియా

కరోనా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానయాన సంస్థలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఇండిగో, గోఎయిర్‌ సంస్థలు తమ ప్రయాణికులకు పలు ఛార్జీల నుంచి వెసులుబాటు కల్పించాయి.

Updated : 10 Mar 2020 02:15 IST

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో విమానయాన సంస్థలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఇండిగో, గోఎయిర్‌ సంస్థలు తమ ప్రయాణికులకు పలు ఛార్జీల నుంచి వెసులుబాటు కల్పించాయి. రీషెడ్యూలింగ్‌, టెకెట్ల రద్దుకు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని గోఎయిర్‌ ప్రకటించగా.. అంతకుముందు ఇండిగో తమ ప్రయాణికులకు ఉచితంగా రీ షెడ్యూలింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా.. ఎయిర్‌ ఇండియా కూడా తమ ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్‌ చేసుకున్న టికెట్లపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. మార్చి 12 నుంచి 31 మధ్య బుక్‌ చేసే టికెట్ల మీద మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి మూడు రోజుల ముందే రీషెడ్యూల్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. టికెట్ల రద్దుకు మాత్రం ప్రయాణికులు రుసుము చెల్లించాలని పేర్కొంది. ప్రాణాంతర కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో చాలా దేశాలు విమాన ప్రయాణాలపై నిబంధనలు విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని