ఆ ప్రాంతాల్లో పెరిగిన గాలి నాణ్యత

దేశంలో వేగంగా విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడి వాహనాలు

Updated : 26 Mar 2020 14:44 IST

దిల్లీ: దేశంలో వేగంగా విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. అత్యవసర వాహనాలు తప్ప ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. 

ఘజియాబాద్‌, నోయిడా ఈ ప్రాంతాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది దేశంలోనే అత్యధిక రద్దీ కలిగిన మార్గం. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతాల నుంచి వెళ్తుంటాయి. దీంతో ఇక్కడ విపరీతమైన వాయుకాలుష్యం ఏర్పడుతుంది. గాలిలో నాణ్యత అత్యంత తక్కువ ఉన్న ప్రాంతాలు ఇవే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఘజియాబాద్‌, నోయిడా ప్రాంతాల్లో వాయు కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత పెరిగింది. నోయిడాలో గాలి నాణ్యత సూచీ 76తో సంతృప్తికరంగా ఉండగా, ఘజియాబాద్‌లో 92 మధ్యస్థంగా ఉంది. మరో 15రోజులు లాక్‌డౌన్‌ కొనసాగనుండగా, వాయు కాలుష్యం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని