Collector: పని చేయలేకపోయా.. జీతం వద్దన్న కలెక్టర్‌

‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరించలేకపోయా.. నాకు అందాల్సిన డిసెంబరు నెల జీతాన్ని నిలిపివేయండి’ అంటూ ఓ జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. సీఎం హెల్ప్‌లైనుకు అందిన ఫిర్యాదులు వంద రోజులు దాటినా ఇంకా

Updated : 29 Dec 2021 07:16 IST

‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరించలేకపోయా.. నాకు అందాల్సిన డిసెంబరు నెల జీతాన్ని నిలిపివేయండి’ అంటూ ఓ జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. సీఎం హెల్ప్‌లైనుకు అందిన ఫిర్యాదులు వంద రోజులు దాటినా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నందున ఇతర అధికారుల వేతనాన్ని కూడా ఆపాలని జిల్లా కోశాధికారికి సూచించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌ జిల్లా కలెక్టరు కరంవీర్‌ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం.. శాఖలవారీగా జరిగిన సమీక్షలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రెవెన్యూ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు తహశీల్దార్ల ఇంక్రిమెంట్లను కూడా ఆపాలని ఆదేశించారు. సమీక్షకు హాజరుకాని జిల్లా మార్కెటింగ్‌ అధికారికి షోకాజ్‌ నోటీసు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని