Shirdi: శిర్డీ సాయి భక్తులకు క్యూలో ఏసీ సౌకర్యం

శిర్డీకి వచ్చే భక్తులకు శుభవార్త చెప్పింది శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌. సాయి దర్శనం కోసం భక్తులు వేచి చూసే మార్గంలో ఏసీ సదుపాయం కల్పించనున్నట్లు ట్రస్ట్‌ పేర్కొంది.

Updated : 05 Jan 2023 06:53 IST

శిర్డీకి వచ్చే భక్తులకు శుభవార్త చెప్పింది శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌. సాయి దర్శనం కోసం భక్తులు వేచి చూసే మార్గంలో ఏసీ సదుపాయం కల్పించనున్నట్లు ట్రస్ట్‌ పేర్కొంది. రూ.109 కోట్ల వ్యయంతో భారీ కాంప్లెక్స్‌ నిర్మాణం సహా భక్తులకు ఉపయోగపడేలా ఇతర సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ‘‘శిర్డీలోని ఆలయ ప్రాంగణంలో దర్శన కాంప్లెక్స్‌ నిర్మిస్తాం. రెండంతస్తుల్లో ఈ భవనం ఉంటుంది. ఈ దర్శన కాంప్లెక్స్‌లో 12 ఏసీ గదులు ఉంటాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. భద్రత కోసం 200 సీసీటీవీ కెమెరాలు అమర్చుతాం’’ అని ట్రస్ట్‌ అధికారి రాహుల్‌ జాదవ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని