1200 ఏళ్లనాటి విగ్రహాలు వెలుగులోకి..

పురాతన నలందా విశ్వవిద్యాలయం సమీపంలో 1200 ఏళ్ల నాటి రెండు రాతి విగ్రహాలను కనుగొన్నారు. బిహార్‌లోని సర్లిచక్‌ గ్రామ సమీపంలోని తార్సిన్హ్‌ కొలనులో పూడిక తీస్తుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి.

Published : 04 Feb 2023 05:00 IST

పట్నా: పురాతన నలందా విశ్వవిద్యాలయం సమీపంలో 1200 ఏళ్ల నాటి రెండు రాతి విగ్రహాలను కనుగొన్నారు. బిహార్‌లోని సర్లిచక్‌ గ్రామ సమీపంలోని తార్సిన్హ్‌ కొలనులో పూడిక తీస్తుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ రెండు విగ్రహాలు ఏ దేవుళ్లవనే వివరాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) వెల్లడించలేదు. విగ్రహాలు బయటపడిన విషయం తెలియగానే స్థానిక ప్రజలు సమీపంలో ఆలయం నిర్మించాలని భావిస్తున్నారని పట్నా సర్కిల్‌ ఏఎస్‌ఐ అధికారి గౌతమి భట్టాచార్య తెలిపారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులకు తెలిపామని.. వారు విగ్రహాలను స్వాధీనం చేసుకొన్నారని వెల్లడించారు. నలందా పురావస్తు ప్రదర్శనశాలలో ఈ విగ్రహాలను ఉంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏడాది క్రితం ఇదే కొలనులో పాలా కాలానికి చెందిన 1300 ఏళ్లనాటి నాగదేవత విగ్రహం బయటపడింది. దీన్ని నలందాలోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని