హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా కాన్సులేట్‌ ఏర్పాటు చేయండి

దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరాలను తీర్చేందుకు హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలని ఆ దేశ హైకమిషనర్‌ బ్యారీ ఓఫారెల్‌ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కోరారు.

Published : 31 May 2023 04:09 IST

హైకమిషనర్‌కు జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచన

ఈనాడు, దిల్లీ: దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరాలను తీర్చేందుకు హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలని ఆ దేశ హైకమిషనర్‌ బ్యారీ ఓఫారెల్‌ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కోరారు. హైకమిషనర్‌ మంగళవారం దిల్లీలో జస్టిస్‌ ఎన్‌వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ భేటీలో ఇరుదేశాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. ఆస్ట్రేలియా పురోగతిలో భారతీయుల పాత్రను ఓఫారెల్‌ శ్లాఘించారు. ఈ సందర్భంగా హైకమిషనర్‌కు జస్టిస్‌ ఎన్‌వీ రమణ భారత రాజ్యాంగ ప్రతి, బొబ్బిలి వీణ హస్తకళాకృతిని బహూకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని