నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా

‘‘రాజకీయ క్రీడలో జైలుపాలైన నా భర్తను 103 రోజుల విరామం తర్వాత కలిశా. ఇన్నాళ్లూ నేల మీదే పడక, ఈగలూ దోమల బాధలు, విపరీతమైన వేడి బాధ మరోవైపు.. అయినా మనీశ్‌ కళ్లలో తన ఆశయ సాధనకు అదే నిశ్చలత్వం చూశా’’ అని దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా భార్య సీమా భావోద్వేగానికి గురయ్యారు.

Published : 08 Jun 2023 05:43 IST

సిసోదియాతో భేటీ అనంతరం భార్య సీమా భావోద్వేగం

దిల్లీ: ‘‘రాజకీయ క్రీడలో జైలుపాలైన నా భర్తను 103 రోజుల విరామం తర్వాత కలిశా. ఇన్నాళ్లూ నేల మీదే పడక, ఈగలూ దోమల బాధలు, విపరీతమైన వేడి బాధ మరోవైపు.. అయినా మనీశ్‌ కళ్లలో తన ఆశయ సాధనకు అదే నిశ్చలత్వం చూశా’’ అని దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా భార్య సీమా భావోద్వేగానికి గురయ్యారు. మద్యం కుంభకోణం ఆరోపణలతో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మనీశ్‌ గత మూణ్నెల్లకు పైగా తిహాడ్‌ జైలులో బందీగా ఉన్న విషయం తెలిసిందే. బెయిలు ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో.. అనారోగ్యంతో ఉన్న భార్య సీమాను, ఇతర కుటుంబసభ్యులను వారి ఇంట్లో కలిసేందుకు దిల్లీ హైకోర్టు గత వారం మనీశ్‌ను అనుమతించింది. పలు షరతుల నడుమ ఈ అవకాశం పొంది ఇంటికి వచ్చిన మనీశ్‌తో తాను పడకగదిలో మాట్లాడుతుండగా బయట పొంచి ఉన్న పోలీసులు తమ సంభాషణ విన్నారని సీమా వెల్లడించారు. ఏడు గంటలపాటు కుటుంబసభ్యులతో గడిపిన మనీశ్‌ మనోనిబ్బరం కాస్త కూడా చెదరకపోవడం తాను గమనించానని ఆమె ట్విటర్‌ వేదికగా హిందీలో రాసిన ఓ లేఖను బుధవారం పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని