బ్రో.. నవ్వు బ్రో.. విక్రమ్‌ ఫొటోలు తీసిన ప్రజ్ఞాన్‌

జాబిల్లి ఉపరితలంపై సంచరిస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌.. చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా తనను అక్కడిదాకా మోసుకెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ను బుధవారం ఫొటోలు తీసింది.

Updated : 31 Aug 2023 08:55 IST

ఈనాడు, బెంగళూరు: జాబిల్లి ఉపరితలంపై సంచరిస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌.. చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా తనను అక్కడిదాకా మోసుకెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ను బుధవారం ఫొటోలు తీసింది. రోవర్‌పై ఉన్న నావిగేషన్‌ కెమెరా ఈ చిత్రాలను క్లిక్‌మనిపించింది. ‘స్మైల్‌.. ప్లీజ్‌’ అన్న క్యాప్షన్‌తో సంబంధిత ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. చంద్రయాన్‌-3 కోసం నావిగేషన్‌ కెమెరాలను ఇస్రో విభాగమైన లేబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో-ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌ (లియోస్‌) అభివృద్ధి చేసింది. ల్యాండర్‌ పాదాల వద్ద అమర్చిన చాస్టే, ఐఎల్‌ఎస్‌ఏ పేలోడ్‌లు ఓ చిత్రంలో కనిపించాయి. చాస్టే ఇటీవల చంద్రుని ఉపరితలం, లోతుల్లోని ఉష్ణోగ్రతల స్థాయులను గుర్తించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని