అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

అవయవ దాతలైన జీవన్మృతులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

Published : 24 Sep 2023 04:39 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటన

చెన్నై, న్యూస్‌టుడే: అవయవ దాతలైన జీవన్మృతులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. అవయవ దానంతో వందల మంది రోగులకు కొత్త జీవితాన్ని ఇచ్చే గురుతర సేవలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. బాధాకర పరిస్థితుల్లోనూ కుటుంబసభ్యుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చే వారి నిస్వార్థ త్యాగంతోనే ఇది సాధ్యపడిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని