Aadhaar: ఆధార్‌ సేవలకు అధికంగా వసూలు చేస్తే భారీ జరిమానా

ఆధార్‌ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది.

Updated : 14 Dec 2023 09:14 IST

దిల్లీ: ఆధార్‌ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై యూఐడీఏఐకు మెయిల్‌ లేదా 1947 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని