కిలో వెల్లుల్లి ధర రూ.500.. పొలాల్లో సీసీ కెమెరాలు

ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు సీసీ కెమెరాలు పెట్టుకోవడం సర్వసాధారణం. ఇపుడు పంటపొలాల్లోనూ ఇవి ప్రత్యక్షం అవుతున్నాయి. గతేడాది టమేటాల ధరలు భారీగా పెరిగినపుడు రైతులు వీటి వైపు మొగ్గు చూపారు.

Published : 17 Feb 2024 06:51 IST

ళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు సీసీ కెమెరాలు పెట్టుకోవడం సర్వసాధారణం. ఇపుడు పంటపొలాల్లోనూ ఇవి ప్రత్యక్షం అవుతున్నాయి. గతేడాది టమేటాల ధరలు భారీగా పెరిగినపుడు రైతులు వీటి వైపు మొగ్గు చూపారు. ఇపుడు వెల్లుల్లి రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి కిలో ధర రూ.500 పలుకుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ ప్రాంతంలోని అయిదారు గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు అమర్చుకొన్నారు. వీటిని ఏర్పాటు చేశాక దొంగతనాలు ఆగిపోయాయని యువరైతు రాహుల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపాడు. ‘‘ఈ కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయి. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగుతుంది’’ అని గజానంద్‌ దేశ్‌ముఖ్‌ అనే మరో రైతు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని