రాజ్యసభ సభ్యుడిగా సంజయ్‌సింగ్‌ ప్రమాణం

ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ మంగళవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

Published : 20 Mar 2024 04:17 IST

అనంతరం తిరిగి జైలుకు చేర్చిన పోలీసు అధికారులు

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ మంగళవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆయన చేత పార్లమెంటులోని తన కార్యాలయంలో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సంజయ్‌సింగ్‌ తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె హాజరయ్యారు. వారితోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌, ప్రధాన కార్యదర్శి పీసీ మోదీ, ఆప్‌ ఎంపీ సంజీవ్‌ అరోడా, సందీప్‌ పాఠక్‌, ఎన్‌డీ గుప్తాలు కూడా హాజరైన వారిలో ఉన్నారు. మనీలాండరింగ్‌ కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న సంజయ్‌ సింగ్‌ను ఆప్‌ రెండో దఫా రాజ్యసభ ఎంపీగా ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలు నుంచి తీసుకెళ్లి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసు అధికారులు పటిష్ఠమైన భద్రతతో ఆయన్ను పార్లమెంటుకు తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత తిరిగి కారాగారానికి చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని