YouTube: 16 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లు, ఫేస్‌బుక్‌ ఖాతాపై నిషేధాజ్ఞలు

జాతీయ భద్రతకు భంగం కలిగిస్తూ, తప్పుడు వార్తల ప్రచారాలపై కేంద్రం కొరఢా ఝుళిపిస్తోంది. తాజాగా మరో 16 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లను బ్యాన్‌ చేసింది.......

Published : 26 Apr 2022 01:51 IST

దిల్లీ: జాతీయ భద్రతకు భంగం కలిగిస్తూ, తప్పుడు వార్తల ప్రచారాలపై కేంద్రం కొరడా ఝుళిపిస్తోంది. ఈ తరహా వార్తల కట్టడికి ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం 22 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్రం..  తాజాగా మరో 16 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లను నిషేధించింది. వీటిలో 10 భారత్‌కు చెందినవి కాగా, మరో ఆరు పాకిస్థాన్‌ కేంద్రంగా నడుస్తున్నాయి. ఓ ఫేస్‌బుక్‌ ఖాతాపైనా నిషేధం విధించింది. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్‌ ఆర్డర్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ వెల్లడించింది. బ్లాక్ చేసిన యూట్యూబ్‌ ఛానెళ్ల వీక్షకుల మొత్తం సంఖ్య దాదాపు 68 కోట్లకు పైగా ఉంది.

ఈనెల 6వ తేదీన కేంద్రం మొట్టమొదటిసారి యూట్యూబ్‌ ఛానెళ్లపై చర్యలు తీసుకుంది. 22 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లపై నిషేధం విధించింది. వీటిలో 18 భారత్‌కు చెందినవి కాగా మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్‌ కేంద్రంగా నడిచేవి ఉన్నాయి. భారత్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్‌ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. న్యూస్‌ ఛానెళ్ల మాదిరిగా లోగోలు, థంబ్‌నెయిల్‌లు వాడుతూ వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గ్రహించింది. వీటితోపాటు భారత భద్రతా దళాలు, జమ్మూ కశ్మీర్‌ అంశాలతోపాటు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు