Maldives: మాల్దీవుల నుంచి బలగాల ఉపసంహరణ.. ప్రభుత్వం ఇంకా చెప్పలేదు: నేవీ చీఫ్

India maldives conflict: తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు గడువు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడున్న బలగాలకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని నేవీ చీఫ్ తెలిపారు. 

Published : 25 Jan 2024 19:22 IST

దిల్లీ: భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు(India maldives conflict) నెలకొన్నాయి. ఈక్రమంలో మాల్దీవుల(Maldives) నుంచి బలగాలను వెనక్కి పిలిపించే అంశంపై భారత నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. అక్కడి నుంచి వైదొలగాలని ప్రభుత్వం రక్షణ సిబ్బందికి ఇంకా చెప్పలేదని తెలిపారు. ‘నిర్ణయం ఏదైనప్పటికీ.. ప్రభుత్వ సూచనల కోసం ఎదురుచూస్తున్నాం. దీనిపై మాకు ప్రభుత్వం నుంచి సమాచారం అందలేదు’ అని వెల్లడించారు.

చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహ్మద్‌ ముయిజ్జు( Mohamed Muizzu) అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్‌-మాల్దీవుల మధ్య దూరం పెరుగుతోంది. లక్షద్వీప్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఇటీవల విమర్శలు చేయడంతో వివాదం ముదిరింది. ఆ సమయంలోనే ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లి వచ్చారు. అనంతరం మార్చి 15 నాటికి తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని గడువు విధించారు.

‘భారత్‌తో వివాదం మనకే ప్రమాదం’.. మాల్దీవుల అధ్యక్షుడికి ప్రతిపక్షాల హెచ్చరిక!

భారత్‌కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటోంది. భారత్‌ సహకారంతో ఏర్పాటుచేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు