Hijab Row: ‘హిజాబ్‌’ వివాదంపై నీతీశ్ కుమార్‌ కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన ‘హిజాబ్‌’ వ్యవహారంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ స్పందించారు....

Published : 15 Feb 2022 01:56 IST

పట్నా: కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన ‘హిజాబ్‌’ వ్యవహారంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ స్పందించారు. ప్రజల మతపరమైన మనోభావాల్ని తమ రాష్ట్రంలో గౌరవిస్తామని, బిహార్‌లో అసలు ఇదొక సమస్యే కాదన్నారు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్‌ను ధరిస్తే దానిపై అసలు కామెంట్‌ చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. బిహార్‌లో ఇదొక సమస్యే కాదన్న ఆయన.. తాము ఇలాంటివి పట్టించుకోబోమన్నారు. ఇదంతా పనికిరాని వ్యవహారమని వ్యాఖ్యానించారు. 

పట్నాలో ప్రజా దర్బార్‌ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన నీతీశ్‌ ‘‘బిహార్‌ పాఠశాలల్లో పిల్లలంతా దాదాపు ఒకేరకమైన దుస్తుల్ని ధరిస్తారు. ఎవరైనా తలపై ఏదైనా పెట్టుకుంటే దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం. ఒకరి మతపరమైన సెంటిమెంట్లను మేం గౌరవిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సమానమే’’ అన్నారు. భాజపా పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని ఉడిపిలో హిజాబ్‌ ధరించిన విద్యార్థునుల్ని కళాశాల్లోకి అనుమతి నిరాకరించడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని