Arvind Kejriwal: కేంద్రంపై కేజ్రీవాల్‌ విసుర్లు

ఆప్‌ సర్కార్‌ ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన’ ప్రకటించిన నేపథ్యంలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ మహిళలతో సమావేశం నిర్వహించారు. 

Updated : 10 Mar 2024 13:15 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించింది. ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన’ పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతినెలా రూ. 1,000 అందించనున్నట్లు ఆప్‌ ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడారు.  ఓ సోదరుడిలా మహిళలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భాజపాకు మద్దతిచ్చే ఇతర మహిళలకు ఇదే విషయాన్ని తెలియజేయాలని కోరారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచిత కరెంట్‌, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా మహిళలకు రూ. 1,000 ఇవ్వనుందన్నారు. ఇప్పటి వరకు భాజపా మహిళల కోసం ఏం చేసిందని.. వారికి ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. 

ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా

మిగిలిన మహిళల పరిస్థితి ఏంటి.. 

మహిళా సాధికారత పేరుతో కొన్ని పార్టీలు (భాజపాను ఉద్దేశిస్తూ) ఇప్పటి వరకు చాలా మోసాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ‘‘ముగ్గురు, నలుగురికి మాత్రమే పార్టీలు పదవిని ఇచ్చి.. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని చెబుతున్నాయి. దీని వల్ల కొందరికే ప్రయోజనం చేకూరుతోంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి?’’ అని ప్రశ్నలు కురిపించారు. తాము ప్రవేశపెట్టనున్న ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన’ పథకం నిజమైన సాధికారతకు దారి తీస్తుందన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా సాధికారత కార్యక్రమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని