Unemployment: పెరిగిన నిరుద్యోగిత రేటు...

భారత్‌లో నిరుద్యోగిత రేటు పెరిగింది. మార్చిలో 7.60శాతం ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్లో 7.83శాతానికి పెరిగినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ (సీఎంఐఈ)

Updated : 02 May 2022 19:14 IST

దిల్లీ: భారత్‌లో నిరుద్యోగిత రేటు పెరిగింది. మార్చిలో 7.60శాతం ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్లో 7.83శాతానికి పెరిగినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. అత్యధిక నిరుద్యోగ రేటు పట్టణాల్లో నమోదైంది. మార్చిలో 8.28 శాతంగా ఇది ఉండగా.. ఏప్రిల్‌లో 9.22 శాతానికి చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమెర తగ్గుముఖం పట్టింది. కరోనా మహామ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నట్లు సీఎంఐఈ పేర్కొంది.

పెరిగిన నిరుద్యోగిత రేటులో హరియాణా, రాజస్థాన్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.  దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక రికవరీ నెమ్మదించడం వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో కరోనా కారణంగా మిలియన్ల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారని.. 2019తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు అదుపులోకి వస్తున్నట్లు వారు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని