Desert Knight: ఎర్రసముద్రంలో అలజడి వేళ.. భారత్‌ వైమానిక విన్యాసాలు!

అరేబియా సముద్రంలో భారత్‌ సహా ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు చేపట్టాయి.

Updated : 24 Jan 2024 18:03 IST

దిల్లీ: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని హౌతీ ఉగ్రవాదులు ఇటీవల దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. నౌకలపై వరుస దాడులు, హైజాక్‌ వంటి ఘటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నడుమ భారత్‌ సహా ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) సంయుక్తంగా భారీ వైమానిక విన్యాసాలు చేపట్టాయి. డెసర్ట్ నైట్‌ (Desert Knight) పేరుతో నిర్వహిస్తున్న గగనతల విన్యాసాల్లో.. మూడు దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్‌లు పాల్గొన్నాయి.

భారత వాయుసేనకు చెందిన Su-30 ఎంకేఐ, MiG-29, జాగ్వార్‌ ఫైటర్‌ జెట్లతో పాటు  సీ-130-జే రవాణా విమానాలు, గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం కలిగిన విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల వాయుసైన్యం మధ్య సమన్వయం, పరస్పర సహకారం మెరుగుపరచుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు భారత వాయుసేన (Indian Air Force) వెల్లడించింది.

కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీల మృతి

 ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్‌, యూఏఈ వైమానిక దళం నుంచి ఎఫ్‌-16 యుద్ధ విమానాలు ఇందులో భాగమయ్యాయి. మరోవైపు, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ రానున్నారు. ఈ పరేడ్‌లో 95 మంది సభ్యుల ఫ్రాన్స్‌ బృందమూ పాల్గొననుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని