Odisha Train Tragedy : నిలకడగా కోరమాండల్‌ లోకోపైలట్ల ఆరోగ్యం

Odisha Train Tragedy: ఒడిశాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో కోరమాండల్ లోకోపైలట్ల ఆరోగ్య పరిస్థితిపై రైల్వేవర్గాలు స్పందించాయి. వారి ఆరోగ్యం గురించి ఏం చెప్పారంటే..? 

Updated : 05 Jun 2023 17:21 IST

భువనేశ్వర్‌: ఒడిశా రైలు దుర్ఘటన(Odisha Train Accident) దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘోర ప్రమాదంలో గాయపడిన ఇంజిన్ డ్రైవర్ గుణనిధి మహంతి, ఆయన అసిస్టెంట్  హజారీ బెహరా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. వారిద్దరికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స అందుతోంది. (Odisha Train Tragedy)

‘ఇద్దరు డ్రైవర్ల ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉంది. వారిలో మహంతిని సోమవారం ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. బెహరాకు మాత్రం తలకు శస్త్రచికిత్స జరగాల్సి ఉంది’ అని ఆగ్నేయ రైల్వే(SER) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అదిత్య చౌధురీ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ పరిస్థితుల్లో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని లోకోపైలట్ల కుటుంబాలు అభ్యర్థించాయి. వారిద్దరు శారీరకంగా, మానసికంగా కోలుకునేలా చూడాలని కోరారు. ఆ ఘోర ఘటనకు వారిని తప్పుపట్టొద్దని, వారు నిబంధనల ప్రకారమే రైలు నడిపారని కుటుంబసభ్యులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) పూర్తి కారణాలపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. డ్రైవర్‌ తప్పిదం లేకపోవచ్చని రైల్వేశాఖ ఉన్నతాధికారులు(Indian Railways) పేర్కొన్నారు. ఘటన సమయంలో రెండు రైళ్లు కూడా పరిమిత వేగానికి లోబడే వెళ్తున్నాయన్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ (Interlocking System)లో మార్పు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని