Anand Mahindra: మహీంద్రాజీ మీ షేర్లు కొంటాం ఒక లక్ష ఇవ్వండి.. ఆయన సమాధానమిదే..!

సృజనాత్మకత ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రశంసించి మరింతగా ప్రోత్సహించడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra). తాజాగా ఆయనకు ఓ నెటిజన్‌ నుంచి భిన్నమైన రిక్వెస్ట్ వచ్చింది. 

Updated : 27 Dec 2023 17:22 IST

ముంబయి: తన దృష్టికి వచ్చిన సరికొత్త విషయాలను నెటిజన్లకు పరిచయం చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).అలాగే ఆయన పోస్టుల్లో ధ్వనించే చమత్కారమూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆయనకు ఓ నెటిజన్‌ నుంచి అనూహ్య అభ్యర్థన వచ్చింది.

ఆనంద్‌ మహీంద్రా.. మహీంద్రా గ్రూప్‌(Mahindra Group) ఛైర్మన్. ఆ సంస్థలో షేర్లు కొనడానికి లక్ష రూపాయలు ఇవ్వాలంటూ ఓ నెటిజన్ మహీంద్రాను అభ్యర్థించారు. ఈ రిక్వెస్ట్‌ చూసి, మహీంద్రా(Anand Mahindra) ఆశ్చర్యపోయారు. ‘ఈ ఆలోచన భలేగా ఉందే. ఈ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. ఇలా అడగడంలో మీ ఉద్దేశం ఏంటి..?’ అని నవ్వుతున్న ఎమోజీని జోడించారు. ఈ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది. కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అతడి ఆత్మవిశ్వాసం అమోఘమని ఒకరు.. రూ.15 లక్షలు ఇస్తే మహీంద్రా థార్‌ కొనుక్కుంటా అని ఇంకొకరు పోస్టులు పెట్టారు.

‘మోదీ యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్లు 2 కోట్లు’

ఇదిలా ఉంటే.. మహీంద్రా థార్‌ వాహనం విషయంలో ఇటీవల ఓ బుడ్డోడి మాటలకు మహీంద్రా నుంచి వచ్చిన స్పందన నెట్టింట్లో వైరల్ అయింది.  థార్‌లో ఎక్స్‌యూవీ700 (XUV700) ఒక మోడల్‌ అని పొరపాటుగా అనుకున్న ఓ పిల్లాడు.. రెండూ ఒకటే అంటూ దాన్ని కొందామని తండ్రిని అడుగుతాడు. ఎక్స్‌యూవీ700లో 700 ఉంది గనక దాని ధర రూ.700 అని అనుకుంటాడు. పర్స్‌లో రూ.700 ఉన్నాయని.. ఆ డబ్బుతో బయటికెళ్లినప్పుడు కొనేద్దామని తండ్రితో చర్చిస్తున్న వీడియో మహీంద్రా కంటపడింది. బాలుడు చెప్పినట్లు థార్‌ను రూ.700కు అమ్మితే త్వరలోనే తమ కంపెనీ దివాలా తీస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని