Mamata Banerjee: రోడ్డు ప్రమాదం.. మమతా బెనర్జీ తలకు గాయం..

Mamata Banerjee: రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. కోల్‌కతాకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 24 Jan 2024 16:53 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి (Accident) గురైనట్లు అధికారులు వెల్లడించారు. బర్ధమాన్‌ నుంచి కోల్‌కతా తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె తలకు స్వల్ప గాయమైనట్లు తెలిపారు.

అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేందుకు బుధవారం మధ్యాహ్నం సీఎం తూర్పు బర్ధమాన్‌ వెళ్లారు. అక్కడి నుంచి వాయుమార్గంలో కోల్‌కతా రావాల్సి ఉండగా.. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆమె రోడ్డు మార్గంలో బయల్దేరారు.

‘ఇండియా’ కూటమికి బీటలు.. దీదీ బాటలోనే ఒంటరి పోరుకు ఆప్‌

ఈ సమయంలో ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్‌షీల్డ్‌కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే ఆమెను మరో వాహనంలో కోల్‌కతాకు తరలించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని