ISRO: గగన్‌యాన్‌ సాకారం దిశగా మరింత చేరువకు..! ‘టీవీ-డీ1’ విజయవంతంపై ప్రధాని మోదీ

ఇస్రో ‘టీవీ-డీ1’ పరీక్ష విజయవంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘గగన్‌యాన్‌’ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందని పేర్కొన్నారు.

Published : 21 Oct 2023 13:45 IST

దిల్లీ: ‘గగన్‌యాన్‌ (Gaganyaan)’ ప్రయోగం దిశగా కీలక ‘టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ-డీ1)’ పరీక్షను ఇస్రో (ISRO) శనివారం విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌ (Crew Module).. పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఓ ట్వీట్‌ చేసింది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. ‘గగన్‌యాన్‌’ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందని పేర్కొన్నారు.

గగన్‌యాన్‌.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

‘భారత మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష మిషన్‌ ‘గగన్‌యాన్‌’ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అంటూ టీవీ-డీ1 పరీక్ష విజయవంతంపై ప్రధాని మోదీ స్పందించారు. తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకే చేపట్టేందుకు ఇస్రో యత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం శాస్త్రవేత్తలు ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించి.. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు