12-15 ఏళ్లవారికి ఫైజర్‌ టీకా సురక్షితం: బ్రిటన్‌

ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ 12-15 ఏళ్ల మధ్య గల పిల్లలకు సురక్షితమేనని బ్రిటన్‌ రెగ్యులేటరీ సంస్థ ధ్రువీకరించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను పరిశీలించిన అనంతరం ఆ వయసులోని చిన్నారులపై ఇది సమర్థంగా పనిచేస్తోందని...

Updated : 21 Dec 2022 14:57 IST

లండన్‌: ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ 12-15 ఏళ్ల మధ్య గల పిల్లలకు సురక్షితమేనని బ్రిటన్‌ రెగ్యులేటరీ సంస్థ ధ్రువీకరించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను పరిశీలించిన అనంతరం ఆ వయసులోని చిన్నారులపై ఇది సమర్థంగా పనిచేస్తోందని మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ జూన్‌ రైన్‌ వెల్లడించారు. 

వైరస్ వల్ల కలిగే ప్రమాదాలను ఈ వ్యాక్సిన్ అధిగమిస్తోందని రైన్‌ చెప్పారు. సుమారు 2వేల మందికి పైగా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్‌ను అతి జాగ్రత్తగా నిర్వహించినట్లు తెలిపారు. 16-25 వయసు వారిలో కనిపించిన విధంగానే 12-15 ఏళ్ల చిన్నారుల్లోనూ యాంటీబాడీలు వృద్ధి చెందాయని చెప్పారు. అయితే, ప్రస్తుత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఈ వయసు పిల్లల గురించి వ్యాక్సినేషన్‌, ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాయింట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని రైన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని