Priyanka Gandhi: మనీలాండరింగ్ కేసు.. ఛార్జ్‌షీట్‌లో ప్రియాంకా గాంధీ పేరు చేర్చిన ఈడీ

మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో దర్యాప్తు సంస్థ ఈడీ కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పేరును చేర్చింది.

Updated : 28 Dec 2023 13:07 IST

దిల్లీ: నగదు అక్రమ చలామణీ (money laundering case) అభియోగాలతో దళారి సంజయ్‌ భండారీపై నమోదు చేసిన ఓ కేసులో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలిసారి ప్రస్తావించింది. అయితే ప్రియాంకను నిందితురాలిగా మాత్రం పేర్కొనలేదు. ఇదే ఛార్జ్‌షీట్‌లో ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా ప్రస్తావించింది.

భండారీ తన అక్రమ ఆర్జనతో లండన్‌లో దక్కించుకున్న ‘12 బ్రియాన్‌స్టోన్‌ స్క్వేర్‌’ అనే ఇంటికి రాబర్ట్‌ వాద్రా మరమ్మతులు చేయించారని, అందులో నివాసం కూడా ఉన్నారని ఈడీ మంగళవారం ఆరోపించింది. బ్రిటన్‌కు చెందిన సుమిత్‌ చడ్ఢా అనే వ్యక్తి.. వాద్రాకు ఈ వ్యవహారంలో సహకరించారని పేర్కొంది. ఈ మేరకు సుమిత్‌తో పాటు వాద్రాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన చెరువథుర్‌ చకుట్టి థంపిపై తాజా అభియోగపత్రం దాఖలు చేశామని ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘లగ్జరీ హోటళ్లకు మాజీ క్రికెటర్‌ టోకరా.. బాధితుల్లో రిషభ్‌ పంత్‌!’

అలాగే దిల్లీకి చెందిన ఒక రియల్‌ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ హరియాణాలో భూమిని దక్కించుకున్నారని ఆ ఛార్జ్‌షీట్‌లో దర్యాప్తు సంస్థ పేర్కొంది. 2006లో ఫరీదాబాద్‌లో ఆ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం, 2010లో ఆ భూమిని అదే ఏజెంట్‌కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది.  ఆ ఏజెంట్‌ కొంత భాగాన్ని థంపికి కూడా విక్రయించాడని తెలిపింది. ఆ లావాదేవీలు వాద్రా, థంపి మధ్య భాగస్వామ్య సంబంధాలు, పరస్పర వ్యాపార ప్రయోజనాలను వెల్లడిచేస్తున్నాయని తన అభియోగాల్లో పేర్కొంది. ఈ కేసులో నిందితుడైన భండారీ 2016లోనే బ్రిటన్‌కు పారిపోయారు. ఆయన్ను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ చేసిన వినతికి బ్రిటన్‌ సర్కారు ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని